తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న మహేష్ తాను ఏదైనా సినిమాను చూస్తే ఆ సినిమా కనుక బాగున్నట్లు అయితే ఆ మూవీ గురించి సోషల్ మీడియా వేదికగా ... లేదా ఇతర మార్గాల ద్వారా స్పందిస్తూ ఉంటాడు.

అలాగే ఆ సినిమా కలెక్షన్ లు పెరగడానికి అలాగే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడానికి దోహదపడుతూ ఉంటాడు. ఇలా మహేష్ ఎన్నో సార్లు ఎన్నో సినిమాల విషయంలో చేశాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మహేష్ విడుదలకు సిద్ధంగా ఉన్న మరో చిన్న విషయంలో కూడా ఇలాగే చేసి ఆ సినిమాపై అంచనాలు పెరిగే విధంగా చేశాడు. ఆ సినిమా ఏది ... ఆ సినిమా గురించి మహేష్ ఏం చెప్పుకొచ్చాడో తెలుసుకుందాం.

తాజాగా సుమంత్ ప్రభాస్ అనే యువ నటుడు మేము ఫేమస్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ సినిమాకు ఈయన స్వీయ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తో ఈ యువ నటుడువెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా రేపు అనగా మే 26 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ని చూసిన మహేష్ ఈ మూవీ గురించి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. సోషల్ మీడియా వేదికగా మహేష్ "మేము ఫేమస్" మూవీ గురించి స్పందిస్తూ ... ఇప్పుడే నేను మేము ఫేమస్ సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. 

మూవీ లోని ప్రతి యొక్క నటీనటులు ముఖ్యంగా ఈ మూవీ రచయిత ... దర్శకుడు మరియు నటుడు అయినటువంటి సుమంత్ ప్రభాస్ తన అద్భుతమైన నటనతో అలరించాడు. ఈ మూవీ విజువల్స్ ... బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు అన్ని క్రాఫ్ట్ లు కూడా అద్భుతంగా కుదిరాయి అని తాజాగా సోషల్ మీడియా వేదికగా మహేష్ ఈ మూవీ గురించి స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: