
గుంటూరు కారం సినిమాకు హైలీ ఫ్లెమబుల్ అనే ట్యాగ్ లైన్ ని యాడ్ చేశారు. మహేష్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ క్రేజీ ట్యాగ్ లైన్ ఎంతగానో నచ్చేసింది. అయితే గతంలో మరో సినిమాకి కూడా ఇదే ట్యాగ్ లైన్ ఉంది అంటూ ఒక వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రాఖీ సినిమాకు కూడా ఇదే ట్యాగ్ లైన్ ఉంది. ఇక ఈ విషయం చర్చకు రావడంతో ఇద్దరు హీరోల అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. రాఖీ సినిమాకు ఈ టాగ్ లైన్ ఉంది అని తెలియక పోవడం వల్లే మహేష్ సినిమాకు పెట్టారా లేదా అన్ని తెలిసే ఈ ట్యాగ్ లైన్ ఉపయోగించుకున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే ఇటీవల గుంటూరు కారం అనే సినిమాకు సంబంధించి మహేష్ పాస్టర్ లుక్ గ్లిమ్స్ విడుదల చేశారు. ఇక సోషల్ మీడియాలో ఈ గ్లింమ్స్ సెన్సేషన్ సృష్టిస్తుంది అని చెప్పాలి. ఏకంగా 28 వ్యూస్ దాటేసింది. ఇక గ్లిమ్స్ కి ఈ రేంజ్ లో ప్రేక్షకాదరణ దక్కడంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 13వ తేదీన అంటే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది అని చెప్పాలి. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని బలంగా నమ్ముతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.