మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ చివరిగా f-3, గణి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. తాజాగా ఇప్పుడు గాంధీవ దారి అర్జున అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వహిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి టైటిల్ అనౌన్స్ మాత్రమే తప్ప ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు చిత్ర బృందం.. అయితే తాజాగా చిత్ర బృందం ఇప్పుడు రిలీజ్ డేట్ ని అనౌన్స్మెంట్ చేస్తూ అందరికీ ఒక్కసారిగా సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పవచ్చు.


గాండీవ దారి అర్జున సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ ని అనౌన్స్మెంట్ ఒక పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది.. సూటు బూటు వేసుకొని స్టైలిష్ లుక్ లో కనిపిస్తు చుట్టూ వెకేషన్ తో యాక్షన్ మోడ్లో కనిపిస్తున్నట్టుగా ఉంది వరుణ్ తేజ్.. ముఖ్యంగా జేమ్స్ బాండ్ తరహాలో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా రిలీజ్ కి ముందు మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా ఉండబోతోంది. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న విడుదల కాబోతోంది ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాల గ్యాప్ లోనే వరుణ్ తేజ్ నటిస్తున్న గాండీవ దారి అర్జున సినిమా థియేటర్లోకి రాబోతోంది.


దీంతో వరుణ్ తేజ్ , చిరు మెగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు కానీ గాండీవ దారి అర్జున సినిమాని సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ చేయర్ అందిస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా యాక్షన్ మూవీతో వరుణ్ తేజ్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకొని అభిమానులను సంతోషపరుస్తారో చూడాలి మరి ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: