తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ నటుడు రాజా వారు రాణి గారు అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీ తర్వాత ఈ నటుడు ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈ నటుడు కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది. దానితో కిరణ్ వరుస సినిమాలో నటిస్తూ వస్తున్నాడు. 

ఇకపోతే ఇప్పటికే ఈ సంవత్సరం కిరణ్ రెండు మూవీ లతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సంవత్సరం కిరణ్ మొదటగా వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత మీటర్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఇలా ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన ఈ నటుడు ఒక సినిమాతో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా ... మరో మూవీ తో ప్లాప్ ను అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ కి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాలోని "సమ్మోహనుడా" అంటూ సాగే రెండవ పాటకు సంబంధించిన ప్రోమోను జూలై 17 వ తేదీన ఉదయం 9 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: