మరో రెండు వారాలలో ‘ఖుషీ’ రాబోతోంది. ‘గీత గోవిందం’ తరువాత సరైన హిట్ లేక సత్యమతమైపోతున్న విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ మూవీతో తిరిగి ట్రాక్ లోకి వస్తానని చాల ఆశలు పెట్టుకున్నాడు. ఈమూవీ విడుదల కాకుండానే విజయ్ పరుశు రామ్ దర్శకత్వంలో ఒక మూవీని మొదలుపెట్టిన విషయం తెలిసిందే.


మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా విజయ్ పక్కన నటిస్తున్న ఈమూవీని దిల్ రాజ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాకు ఫ్యామిలీ స్టార్ అన్న టైటిల్ పెట్టినట్లుగా లీకులు వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే. ‘లైగర్’ ఘోర పరాజయం తరువాత విజయ్ ఆలోచనలలో చాల మార్పులు వచ్చాయి అని అంటున్నారు.




కేవలం కమర్షియల్ మాస్ సినిమాల హీరోగా కాకుండా గతంలో తనకు విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టిన ‘గీత గోవిందం’ లాంటి ఎంటర్ టైనర్ మూవీలను ఎంచుకోవడానికి విజయ్ ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నాలలో భాగమే ఇప్పుడు విజయ్ పరుశు రామ్ ల ఫ్యామిలీ స్టార్ మూవీ అంటూ లీకులు వస్తున్నాయి. ఈమూవీలో మృణాల్ ఠాగూర్ తో పాటు మరొక హీరోయిన్ కూడ ఉంటుందని అంటున్నారు.


ఈసినిమాలో సెకండ్ హీరోయిన్ గా దివ్యాన్ష కౌశిక్ ని సెలెక్ట్ చేసినట్టు టాక్. నాగ చైతన్య మజిలీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దివ్యాన్ష కౌశిక్ రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, సందీప్ కిషన్ మైఖేల్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఆమె సిద్ధార్థ్ తో కలిసి ‘టక్కర్’ మూవీలో కూడ నటించింది. అయితే ఈమెకు నాగచైతన్య తో కలిసి నటించిన ‘మజిలీ’ తప్ప మరే సినిమా కలిసి రాలేదు.  దీనితో విజయ్ దేవరకొండ కాంబినేషన్ ఈమెకు ఎంతవరకు కోరుకున్న హిట్ ను అందించి ఫ్యామిలీ స్టార్ ట్యాగ్ పై కన్ను వేసిన విజయ్ దేవర కొండ ఆశలు ఎంతవరకు తీరుతాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: