రౌడీ స్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాతో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. అయితే డియర్ కామ్రేడ్ నుంచి అతని సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతూ వచ్చాయి. రిలీజ్ ముందు భారీగా హంగామా చేయడం రిలీజ్ తర్వాత నీరసపడటం ఇదే విజయ్ సినిమాల విషయంలో జరుగుతుంది. అందుకే లైగర్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని ఖుషి సినిమా చేశాడు. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ సినిమాలో సమంత ఫీమేల్ లీడ్ గా నటించడం ఒక మెయిన్ హైలెట్ అని చెప్పొచ్చు. విజయ్ సమంత ఆల్రెడీ మహానటి సినిమాలో కొన్ని సీన్స్ చేయగా ఆ సినిమాలో వీరిద్దరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అందుకే శివ నిర్వాణ తను రాసుకున్న లవ్ స్టోరీకి విజయ్ సమంతలను సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే విజయ్ కి ఖుషి కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. డియర్ కామ్రేడ్ నుంచి వరుస ఫ్లాపులు ఇస్తున్నా విజయ్ మీద ఇంకా ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఖుషితో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎకాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ.

ఖుషి సినిమా విజయ్ కెరీర్ ని డిసైడ్ చేయబోతుందని చెప్పొచ్చు. అయితే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలైతే చేస్తున్నాడు కానీ ఫ్యాన్స్ కి హిట్ ఇవ్వడంలో విఫలమవుతున్నాడు విజయ్. అందుకే ఖుషి సినిమా తన కెరీర్ డిసైడ్ చేస్తుందని ఫిక్స్ అయ్యాడు. ఖుషి తప్పకుండా ఆడియన్స్ ని అలరిస్తుందని సినిమాతో మరోసారి విజయ్ తన మార్క్ సెట్ చేస్తాడని అంటున్నారు. క్లీన్ ఎంటర్టైనర్ గా సెన్సార్ నుంచి యు సర్టిఫికెట్ అందుకున్న ఖుషి విజయ్ ఫ్యాన్స్ ని సినీ ఆడియన్స్ ని ఏమేరకు మెప్పిస్తుంది అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: