సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే అంత సులభమైన విషయమేమీ కాదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత టాలెంట్ ఎంత ఉన్న ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి. అలాంటి అదృష్టమే లేక ఎంతో మంది టాలెంట్ ఉన్న హీరోయిన్లు ఇండస్ట్రీలో కనుమరుగైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే కాస్త కూస్తో టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి వచ్చి స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే టాలెంట్ తో పాటు అదృష్టం కలిసొచ్చిన  హీరోయిన్ ఎవరు అంటే ప్రస్తుతం ప్రేక్షకులు అందరూ కూడా శ్రీ లీల పేరు చెప్పేస్తూ ఉన్నారు.


 ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోల అందరూ సినిమాలో ఛాన్సులు తగ్గించుకుంది. తన అందం అభినయంతో ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఇక తన డాన్సులతో అందరిని మెస్మరైస్ చేస్తుంది. ఇక తన క్యూట్ క్యూట్ మాటలతో కుర్రకారు మనసు దోచుకుంది  శ్రీ లీల. వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద సందడి  చేస్తూనే ఉంది. అయితే బోయపాటి దర్శకత్వంలో రామ్ హీరోగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన  స్కంద మూవీలో ఇక ఈ అమ్మడు ఆడి పాడిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరో సారీ ప్రేక్షకులను అలరించింది. సినిమా టాక్ ఎలా ఉన్నా ఎప్పటిలాగానే శ్రీలీలా అందానికి అభినయానికి ఆమె డాన్సులకు ప్రేక్షకులందరూ ఫిదా అయ్యారూ.



 అయితే ఇటీవల స్కంద మూవీ లో హీరోయిన్ పాత్రకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ముందుగా ఈ మూవీలో హీరోయిన్గా శ్రీ లీలను అనుకోలేదట. రష్మిక మందాన్నాన్ని హీరోయిన్గా పెట్టాలని అనుకున్నారట. అయితే ఆమె కొంచెం బిజీగా ఉండడంతో డేట్స్ కేటాయించలేక పోయిందట. ఇక అదే సమయంలో శ్రీ లీల నటించిన ధమాకా సూపర్ హిట్ అవడంతో ఇక ఈ అమ్మడు అయితే బాగుంటుందని బోయపాటి అనుకున్నాడట. సంప్రదింపులు జరపడం శ్రీ లీల ఒప్పుకోవడం చక చక జరిగిపోయాయి. అయితేబోయపాటి తన సినిమాల్లో హీరోయిన్స్ ని ఎంతో చక్కగా చూపిస్తారు. ఇక శ్రీలీలను  కూడా స్కంద మూవీ లో అలాగే చూపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: