రామ్ పోతినేని హీరోగా నీది అగర్వాల్ , నబా నటేష్ హీరోయిన్ లుగా ... డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రామ్ తెలంగాణ యాస లో మాట్లాడి తన నటన తో ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు. ఇకపోతే ఈ సినిమాలో నీది అగర్వాల్ ,  నబా నటేష్ తమ నటనతో అంతకు మించిన అందాల ప్రదర్శనతో కుర్రకారును ఫీదా చేశారు. ఇకపోతే ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించాడు.

ఇక ఈ సినిమా కంటే ముందు చాలా సంవత్సరాల పాటు మూవీ లకు గ్యాప్ తీసుకున్న మణిశర్మమూవీ తో రీ ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ సంగీతం అందించి ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించాడు. ఇకపోతే ఈస్మార్ట్ శంకర్ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ప్రస్తుతం పూరి జగన్నాథ్ , రామ్ హీరోగా డబల్ ఈస్మార్ట్ పేరుతో ఈస్మార్ట్ శంకర్ సినిమాకు కొనసాగింపుగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా వరకు షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. 

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ను అనౌన్స్ చేశారు. ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఈ సినిమాకు కూడా మని శర్మ సంగీతం అందించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించడంతో ఈ మూవీ సంగీతం పై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: