రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌కే పరిమితమయ్యింది. తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఆమె మూడేళ్లుగా నార్త్ లోనే సినిమాలు చేస్తూ అలరిస్తుంది. గతేడాది, అంతుకు ముందు ఆమె వరుసగా నాలుగైదు సినిమాలు చేసి మెప్పించింది.ఒకేసారి ఆమె పది సినిమాల వరకు సైన్ చేయడంతో రెండు మూడు నెలలకు ఓ సినిమాని రిలీజ్ చేసింది. గ్యాప్ లేకుండా సందడి చేసింది. అయితే ఇప్పుడన్నీ అయిపోయాయి. ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. వాటితోనే ఇప్పుడు సస్టెయిన్ కావాల్సి వస్తుంది.రకుల్ కి సక్సెస్‌లు పడలేదు. అజయ్ దేవగన్‌తో చేసిన ఒకటి రెండు సినిమాలు ఫర్వాలేదనిపించాయి, కానీ ఆ తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. దీంతో ఈ బ్యూటీ అక్కడ కూడా ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.దీంతో కొత్త ఆఫర్లు ఈ అమ్మడివైపు చూడటం లేదని టాక్. దీంతో అవకాశాల వేటలో మరోసారి అందాల విందుకు తెరలేపుతుంది. మరి మేకర్స్ ఆదరిస్తారా? మరోసారి ఈ బ్యూటీ పుంజుకుంటుందా అనేది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి