Rx -100 చిత్రంతో మొదటిసారిగా డైరెక్టర్ గా మారిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన పాయల్ రాజ్ పుత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ సినిమాలో తన నటనతో గ్లామర్ తో కుర్రకారులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు నటించిన సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో మళ్ళీ డైరెక్టర్ అజయ్ భూపతి పాయల్ కాంబినేషన్లో మంగళవారం అనే సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ టీజర్ విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఈ రోజున విడుదల చేయడం జరిగింది. మరి ఈ సినిమాతో పాయల్ సక్సెస్ అయ్యిందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం..


సినిమా కథ విషయానికి వస్తే.. మొదట ఒక అబ్బాయి అమ్మాయి మధ్య మంచి స్నేహ బంధాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలోనే ఒక అగ్ని ప్రమాదంలో ఒక అబ్బాయి మరణిస్తారట ..ఆ తరువాత కొద్ది రోజులకు ఆ ఊరిలో ప్రతి మంగళవారం చనిపోయే వారి అక్రమ సంబంధాల గురించి గోడల మీద రాసి చంపేస్తూ ఉంటారట.. అయితే ఆ హత్యలు చేసింది ఎవరా అనే విషయంపై అటు పోలీసులు ఇటు ఊరి ప్రజలు వెతుకుతూ ఉంటారు..అలా ఒక మంగళవారం ఒకరు మరో మంగళవారం ఇంకొకరు దొరకడం జరుగుతుంది. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు ఈ హత్యలకు పాయల్ (శైలజ) కు గల సంబంధం ఉందా లేదా అనే విషయం తెలియాలి అంటే తెరపైన చూడాల్సిందే


సినిమా మొదటి భాగం హైలైట్ గా ఉందని వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలోనే సాగుతుందని ఇంటర్వెల్ దగ్గర హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందని ఈ ఆధారంగానే ఇంటర్వెల్ తర్వాత ఈ సినిమా మరింత హైప్ పెరిగిపోయిందని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్  నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుపుతున్నారు. ఈ సినిమా పార్ట్ 2 ఉంటుందని చివరిలో ట్విస్టులు,క్లైమాక్స్లో అదిరిపోయేలా ఉన్నాయని తెలుపుతున్నారు. మొత్తానికి ఈ సినిమాతో పాయల్ సక్సెస్ అయిందని ప్రేక్షకులు తెలుపుతున్నారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు, ప్రతి ఒక్కరి నటన అద్భుతంగా ఉందని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: