కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో విశాల్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను ఎన్నింటినో అందుకొని తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు గల హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన తాను నటించిన చాలా సినిమాలను తెలుగులో కూడా విడుదల చేసి అందులో కొన్ని మూవీ లతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా విశాల్ "మార్క్ ఆంటోనీ" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించగా ... రీతు వర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ కి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలవగా ... తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సొంతం చేసుకుంది. ఇలా మార్క్ ఆంటోనీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న విశాల్ తదుపరి మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ తాజాగా విడుదల అయింది. విశాల్ తన కెరీర్ లో 34 మూవీ కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ షాట్ ను డిసెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన వివరాలను ఈ మూవీ బృందం పెద్దగా విడుదల చేయలేదు. ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలు మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మేకర్స్ విడుదల చేసే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: