టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో నితిన్ ఒకరు. ఈయన తాజాగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా కెరియర్ ను ప్రారంభించి , ఆ తర్వాత కథ రచయితడిగా మంచి గుర్తింపును సంపాదించుకొని , ప్రస్తుతం వరుస సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న వక్కంతం వంశీ దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.

 ఇకపోతే ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ లో నితిన్ జూనియర్ ఆర్టిస్టు పాత్రలో నటించి తన నటనతో పర్వాలేదు అనే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో మాత్రం విఫలం అయింది.

 దానితో ఈ సినిమా భారీ కలెక్షన్ లను రాబట్ట లేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లో ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ సంస్థ వారు జనవరి 19 వ తేదీ నుండి తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: