చిరంజీవి ‘భోళాశంకర్’ ఘోర పరాజయం చెందడంతో అతడి ఆలోచనలు అన్నీ మారిపోవడంతో కళ్యాణ్ కృష్ణ తో అతడు చేయవలసిన మూవీని పక్కకు పెట్టి దర్శకుడు వశిష్ట తో చేయవలసిన మూవీకి లైన్ క్లియర్ చేసిన విషయం తెలిసిందే. ఈమూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తూ ఉండటంతో ఈమూవీ పై భారీ బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు.‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రేంజ్ లో ఈమూవీ ఉండేలా భారీ ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈమూవీ సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారం నుండి ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ నుండి చిరంజీవి కూడ షూటింగ్ స్పాట్ లోకి రాబోతున్నాడు.ఇది ఇలా ఉంటే ఈమూవీకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు మీడియాకు హాట్ న్యూస్ గా మారింది. ఈమూవీలో గ్రాఫిక్ వర్క్స్ అత్యంత కీలకం కావడంతో పాటు ఈమూవీ కథలో పంచభూతాలు కూడ అత్యంత కీలకంగా మారబోతున్న పరిస్థితులలో భాగ్యనగరంలోని ఒక ప్రముఖ స్టూడియోలో ఈ మూవీకి సంబంధించి 13 భారీ సెట్స్ ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్ నేతృత్వంలో డిజైన్ చేయబడుతున్నట్లు సమాచారం.ఈమధ్య కాలంలో ఏభారీ సినిమా కోసం ఈ స్థాయిలో సెట్స్  వేయలేదని ఈసినిమా చూసే వారికి రాజమౌళి ‘బాహుబలి’ సినిమా కోసం క్రియేట్ చేసిన మాహిష్మతి సామ్రాజ్యం గుర్తుకు వచ్చేలా ఈమూవీ సెట్స్ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి సంభంధించి ఎన్నో బ్లాక్ బష్టర్ హిట్స్ చిరంజీవి ఇచ్చినప్పటికీ పాన్ ఇండియా రేంజ్ లో చిరంజీవికి బ్లాక్ బష్టర్ హిట్ లేదు ఇప్పుడు ఆలోటు ఈమూవీ తీరుస్తుంది అనుకోవాలి. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోవడంతో సినిమాను చూసే సగటు ప్రేక్షకుడు తాను చూసే సినిమాలో ఊహకు అందని కథను ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాంటసీ సినిమాల వైపు ప్రేక్షకుల అభిరుచి బాగా పెరిగిన విషయం దృష్టిలో పెట్టుకుని ఈ విశ్వంభరను తీస్తున్నారు  అనుకోవాలి..మరింత సమాచారం తెలుసుకోండి: