ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు మరియు తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి ఏకంగా 6 సినిమాలు విడుదల అయ్యాయి. అందులో భాగంగా ఈ ఆరు సినిమాలు మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఆ 6 సినిమాలు ఏవి ..? అవి ఏ తేదీన ఏ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా సైంధవ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫిబ్రవరి 3 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ధనుష్ తాజాగా కెప్టెన్ మిల్లర్ సినిమాలో హీరో గా నటించాడు.


మూవీ ఫిబ్రవరి 9 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువబడింది. శివ కార్తికేయన్ తాజాగా ఆయాలాన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఫిబ్రవరి 16 వ తేదీ నుండి సన్ నెక్స్ట్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున హీరో గా రూపొందిన నా సామి రంగ మూవీ ఫిబ్రవరి 15 వ తేదీ నుండి హాట్ స్టార్ లోను ... మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమా ఫిబ్రవరి 9 న లేదా 16 వ తేదీన నెట్ ఫ్లిక్స్ లోను ... ఇక తేజా సజ్జ హీరోగా రూపొందిన హనుమాన్ సినిమా మార్చి 22 న లేదా 25 వ తేదీల్లో "జీ 5" ఓ టి టి లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: