ప్రముఖ మీడియా సంస్థలలో ఒకటైన ఓర్మాక్స్ మీడియా గురించి దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖుల కు సంబంధించినదనీ అందరికీ తెలిసిందే ..సినీ రంగాలలో ఎప్పటికప్పుడు పలు రకాల సర్వేలను సైతం నిర్వహిస్తూ పలు రకాల ఫలితాలను తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సినీ తారలు వెబ్ సిరీస్ లో సినిమాల గురించి ఇలా పలు రకాల సర్వేలు చేస్తూ గత ఏడాది డిసెంబర్ నుంచి జనవరి నెల వరకు సంబంధించిన ఒక టాప్ లిస్టును సైతం ఈ నెలలో విడుదల చేయడం జరిగింది..


ఇందులో టాప్ టెన్ -10 తెలుగు హీరోల లిస్టును సైతం విడుదల చేశారు.. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా టాప్ వన్ లో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు.. గత ఏడాది సలార్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రభాస్ స్థానాన్ని ఎవరు లాక్కోలేకపోయారు. ఇక టాప్-2లో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. గుంటూరు కారం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. టాప్-3 లో ఈసారి అల్లు అర్జున్ నిలిచారు గత ఏడాది ఏ ఒక్క సినిమాలో కూడా నటించని అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంతో ఈ క్రేజ్ అందుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ నాలుగో స్థానంలో నిలిచారు.ఈ ఏడాది దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఐదవ స్థానంలో రామ్ చరణ్ నిలిచారు ప్రస్తుతం గేమ్ చేంజర్  సినిమాలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆరో స్థానంలో ఉండగా నేచురల్ స్టార్ నాని ఏడవ స్థానంలో నిలిచారు గత ఏడాది హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను బాగా మెప్పించారు. ఎనిమిదవ స్థానంలో రవితేజ ఉన్నారు. ఇటీవల ఈగల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. తొమ్మిదవ స్థానంలో విజయ్ దేవరకొండ ఉండగా పదవ స్థానంలో చిరంజీవి నిలిచారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: