ఈ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రకటించి మూడేళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ మోషన్ వీడియో రిలీజ్ చేశారు. అయితే మొదటి నుంచి ఈ కు లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే ఎన్నో సార్లు పోస్టర్స్, వీడియోస్ లీకయ్యాయి. తాజాగా మరో వీడియో నెట్టింట లీక్ అయ్యింది. ఈ మూవీలో మార్కెట్ నడిరోడ్డులో హెలికాఫ్టర్ ల్యాండ్ అవుతుంది. అందులో రామ్ చరణ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సీన్ కు హైలెట్ అవుతుందని అంటున్నారు. థియేటర్లలో ఈ ఎలివేషన్ సీన్ కు గూస్ బంప్స్ రావడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఈ ను ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే ఈ మూవీకి నటీనటుల సెలక్షన్ జరుగుతుంది. అలాగే ఇందులో చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నట్లు ఇటీవలే బోనీ కపూర్ కన్ఫార్మ్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి