మహేష్ బాబు హీరోగా రూపొందిన ఒక్కడు సినిమా గిల్లి అనే పేరుతో తమిళ్ లో రీమేక్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఒక్కడు మూవీ తమిళ్ లో రీమిక్ కావడానికి ముందు జరిగిన పరిస్థితులు ఏమిటో తెలుసుకుందాం. ఒకడు మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి కలెక్షన్ ల వర్షాన్ని కురిపిస్తున్న సమయంలో ఈ మూవీ ని విజయ్ స్పెషల్ గా చూడడం ... అది ఆయనకు అద్భుతంగా నచ్చడం జరిగిపోయింది. వెంటనే ఈ సినిమా రైట్స్ ను కొని దీనిని తమిళ్లో తీయాలి అని విజయ్ డిసైడ్ అయ్యాడు.

అప్పటికే నిర్మాత రత్నం గారు కూడా విజయ్ తో ఓ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. దానితో వెంటనే ఈయన ఒక్కడు సినిమా తమిళ్ రీమేక్ హక్కులను కొనేశాడు. ఇక డైరెక్టర్ ఎవరు అనే వెతుకులాటలో ఉన్న విజయ్ , రత్నం కు ధరణి అయితేనే బాగుంటుంది అని అనిపించింది. దానితో వెంటనే ఆయనకు ఈ సినిమా చూపెట్టగా ఆయన కూడా ఈ మూవీ విజయ్ తో హైలెట్ గా వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆయన కూడా ఈ సినిమా కథలో కొన్ని మార్పులు... చేర్పులను చేసి బౌండ్ స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. ఇక సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా కంప్లీట్ అయ్యింది. 2004వ సంవత్సరం ఈ మూవీ విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలకు ముందు తెలుగులో ఒక్కడు క్రియేట్ చేసిన మ్యాజిక్ ను గిల్లి మూవీ చేయడం కష్టమే అని పలువురు భావించారు. కానీ ఈ మూవీ తెలుగులో ఒక్కడు మూవీ కంటే ఎక్కువ ఇంపాక్ట్ ను తమిళ్ లో చూపించింది.

 ఒక్కడు మూవీ 9 కోట్ల బడ్జెట్ తో రూపొంది 39 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా... గిల్లి మూవీ ఎనిమిది కోట్ల బడ్జెట్లోనే పూర్తి అయ్యి 50 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఒక్కడు మూవీ కంటే మించిన విజయాన్ని అందుకుంది. అలాగే అప్పటివరకు విజయ్ కి లేని సరికొత్త ఇమేజ్ ను ఈ  మూవీ విజయ్ కి తీసుకువచ్చింది. అలా ఒక్కడు మూవీతో టాలీవుడ్ లో మహేష్ కు ఏ రేంజ్ గుర్తింపు అయితే దక్కిందో తమిళ్ లో విజయ్ కి కూడా ఈ సినిమా ఆరెంజ్ గుర్తింపును తీసుకువచ్చింది. మరి ఆ టైంలో విజయ్ కి సూపర్ క్రేజ్ ను తీసుకు వచ్చిన గిల్లి మూవీ మరికొన్ని రోజుల్లో రీ రిలీస్ కానుంది. మరి ఈ సినిమా రీ రిలీస్ లో బాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ ఇంపాక్ట్ ను చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: