ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఇక ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ ఆయనతో తీయబోయే సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను ప్రకటించారు. నిజానికి వీళ్ళిద్దరి కాంబోలో వచ్చే సినిమాకి సంబంధించిన ఎనౌన్స్మెంట్ ఎప్పుడో చేయాల్సింది. కానీ ఇప్పటివరకు సెట్స్ పైకి మాత్రం తీసుకురాలేదు. దీంతో ఇప్పుడు నందమూరి అభిమానులు ఈ విషయంపై చాలా కోపంగా ఉన్నారు. తాజాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్  పుట్టినరోజు సందర్భంగా 2024వ సంవత్సరంలో ఈ సినిమాను తెరపైకి తీసుకువస్తున్నాము సెట్స్

 పైకి రాబోతుంది అంటూ మేకర్స్ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఇప్పుడు ఇదే పెద్ద తలనొప్పిగా మారింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు చాలామంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తే మరి సలార్ టు సినిమా సంగతి ఏంటి సలార్  మరింత ఆలస్యంగా వస్తుందా అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. మరి సలార్ టూ ను పక్కనపెట్టి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తే ప్రభాస్ ఖాతాలో మళ్ళీ హిట్ ఎప్పుడు పడాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా

 స్టార్ హీరో ప్రభాస్ కల్కి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా విడుదల అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇందులో భాగంగానే ఇప్పుడు కల్కి సినిమా తర్వాత మళ్లీ అలాంటి పెద్ద హిట్ ప్రభాస్ ఖాతాలోకి రావాలంటే ఖచ్చితంగా స్పిరిట్ రావాలి. మరి ఆ సినిమా వచ్చిన తర్వాత సలార్ సినిమా వస్తుందా.. లేక సలార్ టు వచ్చిన తర్వాత స్పిరిట్ వస్తుందా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రభాస్ అభిమానులు. నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వీరి కాంబోలో సినిమా ఫిక్స్ అయింది అన్న అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో ఈ అనౌన్స్మెంట్ ఇప్పుడు అందరికీ పెద్ద తలనొప్పిగా మారింది అంటున్నారు డార్లింగ్ అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: