టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అనుకున్న దాని కంటే చాలా స్పీడుగా జరుగుతున్నట్లు దానితో ఈ మూవీ ని మరింత ముందు గానే విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఓజి మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ సమయానికి ఓజి మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో , ఈ మూవీ ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానితో ఆ తేదీనే దేవర మూవీ ని విడుదల చేసే ఆలోచనలో యూనిట్ ఉన్నట్లు ఓ వార్త చాలా రోజులుగా వైరల్ అవుతుంది.

ఇకపోతే దేవర మూవీ బృందం సెప్టెంబర్ 27 వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో స్ట్రాంగ్ గా ఉన్నట్లు మరో ఒకటి , రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ నిజం గానే దేవర మూవీ ని అక్టోబర్ 10 వ తేదీన కాకుండా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించినట్లు అయితే ఇది ఎన్టీఆర్ అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్ అవుతుంది. మరి దేవర మూవీ ని ఏ తేదీన విడుదల చేస్తారో అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: