బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సూపరిచితమే.. ఎందుకంటే ఈమె ప్రభాస్ తో సాహో మూవీలో నటించింది. అయితే ఎన్నో అంచనాలతో ప్రభాస్ సరసన సాహో మూవీలో నటించిన శ్రద్ధా కపూర్ కి నిరాశ మిగిలింది.ఎందుకంటే సాహో మూవీ విడుదలై ఎలాంటి టాక్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణిద్దాం అనుకున్న శ్రద్ధా కపూర్ కి మొదటి సినిమాతోనే గట్టి దెబ్బ తగిలింది.దాంతో ఇక బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది శ్రద్ధా కపూర్.అయితే గత కొద్ది రోజుల నుండి శ్రద్దా కపూర్ రాహుల్ మోడీతో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టకపోయినప్పటికీ ఆయనతో వెకేషన్ లకి వెళ్తూ, ముంబై వీధుల్లో కలిసి ఒకే కారులో తిరుగుతూ అప్పుడప్పుడు మీడియా కంట పడుతుంది.

 అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ప్రియుడు రాహుల్ మోడీకి బ్రేకప్ చెప్పినట్టు బీ టౌన్ లో ఓ వార్త వినిపిస్తోంది. అయితే దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో శ్రద్ధా కపూర్ చేసిన పనే.మరి ఇంతకీ శ్రద్దా కపూర్ చేసిన పని ఏంటి.. ఎందుకు బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పింది అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తాజాగా స్త్రీ 2 అనే సినిమాలో నటిచింది. అయితే ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా శ్రద్దా కపూర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో రాహుల్ మోడీని అన్ ఫాలో చేసింది.ఇక రాహుల్ ని ఒక్కడినే అంటే ఏదో పొరపాటున టెక్నికల్ ఇష్యూ అని అనుకోవచ్చు.

కానీ రాహుల్ మోడీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరినీ శ్రద్దా కపూర్ అన్ ఫాలో చేయడంతో సోషల్ మీడియాలో బ్రేకప్ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయం విన్న నెటిజన్స్ నెల క్రితమే రాహుల్ మోడి పై పోస్ట్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇంతలోనే బ్రేకప్ చెప్పేసిందా అని కామెంట్లు పెడుతున్నారు.ఇక మరికొంతమందేమో బ్రేకప్ వార్తలతో సోషల్ మీడియా లో, మెయిన్ మీడియాలో హైలెట్ గా నిలిస్తే తను నటించిన స్త్రీ 2 మూవీకి ప్రమోషన్స్ అవుతుంది అని ఇలా ప్రమోషనల్ స్టంట్ గా తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసింది అని మరి కొంతమంది భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ శ్రద్ధ కపూర్ రాహుల్ మోడీని అన్ ఫాలో చేయడంతో బ్రేకప్ రూమర్స్ బీటౌన్ లో గుప్పుమన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: