టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మికకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా సినిమాల ఎంపికలో రష్మిక ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్, యానిమల్, పుష్ప ది రూల్ సినిమాలు రష్మికకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. పుష్ప2 సినిమా కోసం రష్మిక ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
 
స్టార్ హీరోయిన్ రష్మిక సినిమాల కోసం ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. రష్మిక ఎంపిక చేసుకునే ప్రాజెక్ట్స్ సైతం ఇతర హీరోయిన్లకు షాకిస్తుండటం గమనార్హం. రష్మిక రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఆమె అభిమానులకు సైతం ఒకింత ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
 
కిర్రిక్ పార్టీ సినిమాతో రష్మిక కెరీర్ మొదలు కాగా సినిమా సినిమాకు రష్మిక అంతకంతకూ ఎదుగుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇతర హీరోయిన్లకు భిన్నంగా అడుగులు వేస్తుండటం రష్మికకు ప్లస్ అవుతోంది. రాబోయే రోజుల్లో రష్మిక సక్సెస్ రేట్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రష్మిక రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
 
రష్మిక ఇతర భాషల్లో సైతం సత్తా చాటుతుండగా సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే రష్మికకు కెరీర్ పరంగా తిరుగుండదని చెప్పవచ్చు. రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో 2025 సంవత్సరంలో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది. రష్మిక ఒకవైపు గ్లామరస్ రోల్స్ లో నటిస్తూనే మరోవైపు అభినయ ప్రధాన పాత్రల్లో నటించడం ద్వారా సత్తా చాటుతున్నారు. కెరీర్ పరంగా ఎంత ఎదిగినా సింపుల్ గా ఉంటూ రష్మిక సత్తా చాటుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లకు జోడీగా స్టార్ హీరోయిన్  రష్మిక నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.




 


మరింత సమాచారం తెలుసుకోండి: