ఫైర్ బ్రాండ్ అనగానే బాలీవుడ్ లో అందరికీ కంగనా రనౌత్ గుర్తుకొస్తుంది. అలాంటి ఈమె చెల్లిపై తాజాగా టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్లు చేయడంతో పాటు ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన హీరోయిన్స్లలో తాప్సి కూడా ఒకరు.  కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. తనకంటూ ఒక మంచి గుర్తింపును అందుకుంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి  వెళ్ళిన ఈమె..  అక్కడ వరుస సినిమాలు చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే స్టార్ స్టేటస్ ను అందుకుంటున్న ఈమె వరస చిత్రాలలో నటిస్తూ అటు ప్రొడ్యూసర్ గా పలు చిత్రాలు కూడా నిర్మిస్తోంది.

తాజాగా గాంధారి , ఓ లడ్కి హై కహా వంటి చిత్రాలలో నటిస్తున్న ఈమె తనపై వచ్చిన ట్రోల్స్ పై కూడా స్పందిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే రీసెంట్గా కంగనా రనౌత్ సోదరి రంగోలి గతంలో తనపై చేసిన విమర్శలపై తాజాగా రియాక్ట్ అయ్యింది తాప్సి. ఈమె మాట్లాడుతూ.." మనం మాట్లాడే మాటలు మన పెంపకాన్ని, మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి.  నేను కంగనా లాగా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్ల కాపీ అయి ఉండవచ్చు అలాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ ని నేను కాపీ కొట్టానని అంటే కనుక మాత్రం నేను దానిని సంతోషంగానే అంగీకరిస్తాను.  కష్టపడి తన సొంత ప్రయాణాన్ని ఏర్పరచుకున్న ఏ స్త్రీ గురించి నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడను.  అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటే మంచిది" అంటూ తాప్సీ తెలిపింది.

అయితే ఈ గొడవ ఇప్పుడు జరిగింది కాదు.. 2019లో జరిగింది.  కానీ దీనికి రీసెంట్గా తాప్సి స్పందించడం గమనార్హం ఇక ప్రస్తుతం తాప్సీ చేసిన ఈ కామెంట్ లు  సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: