
ఇక ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది .. ఇక ఇప్పుడు కూడా ఈ సినిమా షూటింగ్ జరుగుతానే ఉంది .. ఇక డైరెక్టర్ బోయపాటి ఇప్పటికే టీజర్ కాన్సెప్ట్ ఎలా ఉండాలో కూడా రెడీ చేశారట .. ఇక ఇప్పటినుంచే దానికోసం విజువల్స్ ను తీసి పక్కన పెడుతున్నారట .. ఇక ఈ టీజర్ పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఊహించని రీతిలో భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది .. ఇక మరో పక్క బాలయ్య కొత్త సినిమాను తన పుట్టినరోజు నాడు ప్రకటించబోతున్నారట .. బాలకృష్ణకు వీర సింహారెడ్డి రూపంలో భారీ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో మరోసారి స్టార్ హీరో సినిమా చేయబోతున్నాడు ..
తాజాగా ఈ దర్శకుడు బాలీవుడ్ లో జాట్ సినిమాతో సన్నీ డియోల్ కు భారీ హిట్ ఇచ్చాడు .. ఈ ఊపులోనే బాలయ్యతో మళ్ళీ సినిమా చేస్తున్నాడు .. రామ్ చరణ్ పెద్ది సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న వృద్ధి సినిమాస్ ఈ మూవీని నిర్మిస్తున్నాయి .. మరో సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కాబోతుందని తెలుస్తుంది .. ఇక బాలయ్య కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను తీసుకురాబోతున్నారట . ఇక వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు .. మరోపక్క హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా బాలయ్య ఓ సినిమా చేస్తారని వార్తలు కూడా వస్తున్నాయి . ఇది ఇంకా కార్యరూపం దాల్చే అవకాశాలు లేవని అంటున్నారు .