
అయినప్పటికీ కూడా వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ధియేటర్లో భారీ విజయం సాధించింది .. ఇంతకీ ఆ సినిమా ఏంటో అనుకుంటున్నారా ? అదే కబాలి .. 100 కోట్ల బడ్జెట్తో తెర్కక్కిన ఈ సినిమా 650 కోట్లకు పైగా కలెక్షను రాబట్టింది .. రిలీజ్ కు ముందే టీజర్ , ట్రైలర్ తో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది .. ఇక 2016లో విడుదలైన కబాలి సినిమాకి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది .. కోలీవుడ్ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమాను కళైపులి ఎస్.థాను నిర్మించారు .. కబాలి అనే వయసు పైబడిన గ్యాంగ్ స్టర్ పాత్రలో సూపర్ స్టార్ రజిని ఎంతో స్టైలిష్ గా నటించారు .. హీరో జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత తన శత్రువులపై ఎలా పగ తీర్చుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ ..
ఇదే క్రమంలో చనిపోయారు అనుకున్న తన భార్య కూతురి కోసం వెతకడం ఆ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది మిగిలిన స్టోరీ .. ఈ సినిమాలో రజినీకాంత్ భార్యగా కుముదవల్లి క్యారెక్టర్ లో హీరోయిన్ రాధిక ఆప్టే నటించింది .. ఇక ఈ సినిమాలో నటించే సమయంలో రాధిక వయసు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే . ఇక ఈ మూవీ తమిళం తో పాటు తెలుగు , హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 10 వేల స్క్రీన్ లలో రిలీజ్ అయి భారీ రికార్డు క్రియేట్ చేసింది .. అలాగే అమెరికాలోనే 480 స్క్రీన్ లలో , మలేషియాలో 490 స్క్రీన్స్ లో .. గల్ఫ్ దేశాల్లో 500 స్క్రీన్ లో రిలీజ్ చేశారు .. ఒక ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది .. ఇలా మూవీ రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది ..