తమిళ స్టార్ హీరో సూర్యకి అమ్మాయిలలో మామూలు క్రేజ్ లేదు. సూర్య అటు సినీ జీవితం.. ఇటు కుటుంబ జీవితం రెండు సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. సూర్య తెలుగుతో పాటుగా తమిళంలో కూడా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈయన తమిళ హీరో అయినప్పటికీ.. తెలుగు అభిమానుల నుండి కూడా చాలా ప్రేమ, ఆధారణలు పొందారు. ఈయన నటన అంటే ఎంతో మందికి ఇష్టం. విలక్షణమైన పాత్రలలో నటిస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. సూర్య ప్రస్తుతం రెట్రో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో గ్లామరస్ హీరోయిన్ పూజా హెగ్డే, సూర్యకి జంటగా నటిస్తుంది. రెట్రో సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.
 
రొమాంటిక్ యాక్షన్ సినిమా వచ్చే నెల 1న విడుదల కానుంది. రెట్రో మూవీతో హీరోయిన్ పూజా హెగ్డే,  హీరో సూర్య మంచి హిట్ అందుకుంటారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ తో దూసుకెళ్తూ.. మరింత అంచనాలు పెంచుతుంది. ఇక సూర్య మళ్లీ లవ్ స్టోరీతో రావడంతో అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. రెట్రో సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో హీరో సూర్య, హీరోయిన్ పూజా హెగ్డే పాత్రలు చాలా కొత్తగా ఉంటాయని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా మంచి రికార్డ్ కొడుతుందని టాక్ కూడా వినిపిస్తుంది.

ఇటీవలే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు కూడా జరిగాయి. అయితే ఈ సినిమా విడుదలకు ముందే దూసుకెళ్తుంది. ఈ మూవిపైన ఓవర్సీస్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమానికి యూకేలో డే 1 కోసం  ఏకంగా 5800కి పైగా టికెట్స్ అమ్ముడు పోయినట్లు మూవీ మేకర్స్ తెలిపారు. దీంతో మొదటి రోజు యూకే కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో అని ఆసక్తి మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: