చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర  సినిమా  షూటింగ్ పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. సోషియో ఫాంటసీ సినిమాతో రాబోతున్న ఈ సినిమా పైన అభిమానులకు చాలా అంచనాలు ఏర్పడ్డాయి. త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. మరి కొంతమంది హీరోయిన్స్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ తో  చిరంజీవి కలిసి నటించారు.


అయితే చిరంజీవి చిత్రాలలో భార్యగా ,చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఒకరు ఉన్నారు. ఇక ఆ ముద్దుగుమ్మ కూడా ఒక స్టార్ హీరోయిన్ అన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. ఇతర హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉన్నది.  ఆ హీరోయిన్ ఎవరో కాదు నయనతార.. తెలుగు ,తమిళ్ వంటి భాషలలో స్టార్ హీరోయిన్గా రానిస్తున్న నాయనతార ఇటీవలే హిందీలో కూడా అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకున్నది.



లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు నయనతార.. చిరంజీవితో భార్యగా చల్లిగా నటించింది. సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవికి భార్యగా నటించింది నయనతార. ఆ తర్వాత గాడ్ ఫాదర్ చిత్రంలో కూడా చిరంజీవికి చెల్లిగా నటించింది. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో తరచూ యాక్టివ్గా ఉండే నయనతార పలు రకాల బ్రాండ్ ప్రమోషన్స్ తో కూడా అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే తరచూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా నయనతార కూడా వివాదాలలో నిలుస్తూనే ఉన్నది. తన భర్త విగ్నేష్ తో కలిసి పలు సినిమాలలో నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నది నయనతార. సరికొత్త కథలతో కూడా విభిన్నమైన అంశాలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది.


నయనతార సినిమాల విషయానికి వస్తే టాక్సిస్, మన గంటి సీన్స్ 1960, డియర్ స్టూడెంట్స్ రక్కాయి, తదితర చిత్రాలలో నటిస్తూ ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: