సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం.. మాయాలోకం అన్న డైలాగ్స్ ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు.  ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అని .. ఎవరి స్థానం శాశ్వతం కాదు అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే . అయితే కొన్ని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మాత్రం హీరోయిన్స్ హీరోలు పెట్టుకుంటూ ఉంటారు . మరీ ముఖ్యంగా హీరోయిన్స్ ఒక రెండు సినిమాలు హిట్ పడితే కచ్చితంగా మంచి సినిమాలు తమ ఖాతాలో పడతాయి అన్న అభిప్రాయం ఆలోచనలు ప్రతి ఒక్క హీరోయిన్  కి ఉంటుంది . అదే విధంగా అనుకునేది తెలుగు అమ్మాయి "అంజలి" .


సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అంజలి గేమ్ ఛేంజర్ సినిమాలో తన నటన పర్ఫామెన్స్ కు గాను మంచి మార్కులు వేయించుకుంది. నిజం చెప్పాలి అంటే రామ్ చరణ్ తర్వాత ఆ సినిమా కారణంగా పాజిటివ్ కామెంట్స్ దక్కించుకున్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ అంజలి అనే చెప్పాలి . చాలా బాగా నటించింది అంటూ పెద్ద పెద్ద హీరోలు కూడా మెచ్చుకున్నారు.  అయితే ఈ సినిమా తర్వాత అంజలికి మంచి మంచి సినిమాలలో ఛాన్సులు వస్తాయి అని అంజలి కెరియర్ లో సెటిల్ అయిపోయిన్నట్లే అని మాట్లాడుకున్నారు .



అసలు ఈ సినిమా తర్వాత అంజలి పేరు నే మర్చిపోయారు స్టార్ డైరెక్టర్స్. ఒక్కటంటే ఒక్క బిగ్ ఆఫర్ కూడా అంజలి ఖాతాలో లేకుండా పోయింది.  ఎందుకని అంజలికి ఆఫర్స్ ఇవ్వడం లేదు అంటే మాత్రం అంజలి ఫిజిక్ అనే సమాధానం వినిపిస్తుంది. అంజలి ఫిజిక్ అందరు హీరోలకి సెట్ అవ్వదు అని అంజలి బాడీ కొంతమంది హీరోల పక్కనే హీరోయిన్గా మ్యాచ్ అయ్యేటట్టు ఉంటుంది అని.. మరీ ముఖ్యంగా సీనియర్ హీరోస్ కి సూట్ అవుతుందే గాని యంగ్ హీరోస్ కి హీరోయిన్గా అంజలి అస్సలు సూట్ కాదు అని జనాలు మాట్లాడుకుంటూ వచ్చారు.



అయితే అంజలి మాత్రం కోలీవుడ్ ఇండస్ట్రీలో బాగానే అవకాశాలు సంపాదించుకుంటూ కెరియర్ పరంగా ముందుకు వెళ్ళింది . తెలుగులో సీనియర్ హీరో వెంకటేష్ సరసన స్క్రీన్ షేర్ చేసుకొని నటించి మెప్పించింది. ఆ తర్వాత గీతాంజలి సినిమాతో నటించి మెప్పించింది.. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ సినిమాతో మెప్పించింది. అయితే బిగ్ స్టార్స్ చిరంజీవి - ప్రభాస్ - ఎన్టీఆర్ - బన్నీ లాంటి స్టార్స్ సినిమాలలో అవకాశాలు వస్తే అంజలి కెరియర్ లో సెటిల్ అయిపోయినట్లే అంటున్నారు జనాలు.  కానీ ఆ ఛాన్స్ వచ్చే విధంగా కనిపించట్లేదు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అంటూ అంజలి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: