సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోలకి పడదు .. హీరోయిన్లు హీరోయిన్లకి పడదు.. ఎక్కడో రేర్ గా మాత్రమే డైరెక్టర్లకి హీరోయిన్లకి అస్సలు పడకుండా వస్తూ ఉంటుంది . చాలా మంది ఈ విషయాన్ని ఒప్పేసుకుంటూనే వచ్చారు.  అయితే ఇక్కడ మాత్రం పూర్తిగా డిఫరెంట్ . అసలు సినిమాకి సంబంధంలేని ఓ డైరెక్టర్ భార్య సినిమాలో లీడ్ పాత్ర పోషిస్తున్న స్టార్ హీరోయిన్ ఇద్దరు సెట్లోనే బూతులు తిట్టుకున్నారు . ఇద్దరు జుట్లు జుట్లు పట్టుకొని కూడా కొట్టుకునే వారేమో..? సెట్లో ఈ విధంగా వాళ్ళు బిహేవ్ చేయడానికి కారణం డైరెక్టర్ భార్య ఓవర్ యాక్షన్ అంటూ ఓ న్యూస్ బయటికి వచ్చింది. 


ఇది ఒక నార్మల్ సినిమా . ఆమె ఒక  డైరెక్టర్ భార్య . సాధారణంగా సినిమా షూటింగ్ జరిగేటప్పుడు సినిమా లో నటించే స్టార్ హీరో హీరోయిన్లు లేదా మిగతా స్టార్ పర్సన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని అలౌ చేస్తూ ఉంటారు . ప్రతి ఒక్క రోజు అలౌ చేస్తారని చెప్పలేము .. కానీ ఎప్పుడైనా రేర్ మూమెంట్లో అలౌ చేస్తూ ఉంటారు . అయితే ఒక స్టార్ డైరెక్టర్ భార్య మాత్రం కూసింత హద్దులు మీరుతూ భర్త డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వేలు పెడుతూ అది అలా తీయాలి ఇది ఎలా తీయాలి అంటూ లిమిట్స్ క్రాస్ చేస్తూ వచ్చేదట .



మరీ ముఖ్యంగా చాలా డెడికేషన్ గా వర్క్ చేసే హీరోయిన్ విషయంలో ఆమె వేలు పెట్టింది . దీనితో అక్కడ రచ్చ రంబోలా అయిపోయింది . డైరెక్టర్ కాకుండా ఆమె చేసిన సీన్ బాగోలేదు అంటూ డైరెక్టర్ భార్య ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిసార్లు పైగానే ఒక సీన్ ని మళ్లీ మళ్లీ నటింపచేసేలా టేక్స్ మీద టెక్స్ తీయించిందట. దీంతో స్టార్ హీరోయిన్ కి పూర్తిగా మండిపోయి డైరెక్టర్ నువ్వా? మీ ఆయనా..? అంటూ స్ట్రైట్ గానే సినిమా సెట్స్ లో అందరి ముందు నిలదీసిందట . దీంతో ఆ డైరెక్టర్ భార్య  పక్కనే ఉన్న హీరో ఆమెకు నచ్చ చెప్పాలని చూసినా ఆ హీరోయిన్ మాత్రం అస్సలు వినలేదట .



దీంతో వెంటనే ఆమె ఆ హీరో వద్దకు వెళ్లి ఇలాంటి హీరోయిన్ ఈ సినిమాలో వద్దు అంటూ కూసింత టంగ్ స్లిప్ అవుతూ ఆమెపై వచ్చిన రూమర్స్ ను సినిమా సెట్స్ లో ఉండే అందరి ముందే నిర్మొహమాటంగా చెప్పేసిందట . దీంతో వెంటనే అక్కడ స్టార్ హీరోయిన్ అదేవిధంగా డైరెక్టర్ భార్య హద్దులు మీరుకుంటూ పోట్లాడుకునే స్థాయికి వెళ్లిపోయారట . అక్కడే ఉన్న హీరో అదే విధంగా డైరెక్టర్ ఇద్దరు కూల్ చేసి సినిమా షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసి మరి ఆ రోజు ప్యాకప్ చెప్పేసారట .ఈ విషయాన్ని బయటకు రానికుండా చిత్ర బృందం బాగానే మేనేజ్ చేసినా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఓ న్యూస్ బయటకు వచ్చేసింది . దీంతో ఇదే విషయాన్ని ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: