- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ - ర‌ష్మిక మంద‌న్న అంటేనే సోష‌ల్ మీడియా లో న్యూస్ ఎలా పాపుల‌ర్ అవుతుందో తెలిసిందే. వీరిద్ద‌రు క‌లిసి ముందుగా గీత గోవిందం సినిమా లో న‌టించారు. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్‌. ఆ సినిమా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నారంటూ ఒక్క‌టే వార్త‌లు వ‌స్తున్నాయి. చాలా సార్లు వీరిద్ద‌రి పెళ్లి ఫిక్స్ అయిపోయింద‌ని .. త్వ‌ర‌లోనే వీరు పెళ్లి పీఠ‌లు ఎక్క‌బోతున్నార‌ని.. వీరు భార్య భ‌ర్త‌లు కాబోతున్నారంటూ ఒక్క‌టే వార్త‌లు వినిపించాయి. అయితే అవేవి ఇప్ప‌టి వ‌ర‌కు నిజం కాక‌పోయినా వీరి స్నేహ బంధం అలా కొన‌సాగుతూ వ‌స్తోంది. గీత గోవిందం సినిమా త‌ర్వాత డియ‌ర్ కామ్రేట్ సినిమా లో కూడా ఈ జంట మ‌రోసారి క‌నువిందు చేసింది.


ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం టాలీవుడ్ నుంచి రాబోతోన్న భారీ సినిమా ల‌లో ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి సెన్షేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర కొండ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న మోస్ట్ అవైటెడ్ సినిమా కింగ్‌డ‌మ్ గురించి అంద‌రికి తెలిసందే. ఈ సినిమా త‌ర్వాత మ‌రో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ రాహుల్ సంకృత్యాన్ కలయికలో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ ని హీరో విజయ్ దేవ‌ర‌కొండ‌ చేయనున్నాడు. ఆల్రెడీ ట్యాక్సీవాలా చేసిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మరో సినిమా ప్లాన్ చేస్త‌న్నార‌ట‌. ఈ సినిమా లో హీరోయిన్ గా విజ‌య్ కు అత్యంత ఇష్టురాలు అయిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కన్ఫర్మ్ అయ్యింది. దర్శకుడు అలాగే నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నుంచి వ‌చ్చిన లేటెస్ట్ హింట్ తో ఇది క‌న్ ఫార్మ్ అయ్యింది. మ‌రోసారి విజ‌య్ - ర‌ష్మిక కాంబినేష‌న్ అంటే వెండి తెర ఊగిపోవాల్సిందే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: