మెగా హీరో రామ్ చరణ్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈ హీరో చిరంజీవి వారసుడిగా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. తనదైన సినిమాలు, నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. ఇప్పటివరకు తాను నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. అందులో కొన్ని సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా.... మరికొన్ని సినిమాలు పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోయాయి. రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా అనంతరం చెర్రీ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. 

ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పూర్తి కాకముందే రామ్ చరణ్ మరికొన్ని సినిమా ప్రాజెక్టులకు సైన్ చేశారు. తన తదుపరి సినిమాను విక్టరీ వెంకటేష్ తో కలిసి తీయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లుగా సినీ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అవుతుంది.

వెంకటేష్ - రామ్ చరణ్ కాంబినేషన్లో ఈ సినిమా తీస్తే మంచి విజయాన్ని అందుకుంటుందని దర్శకుడు భావిస్తున్నారట. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అనిల్ మెగా స్టార్ చిరంజీవితో సినిమాను తీయడానికి ఈ సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే చెర్రీ, వెంకీ కాంబినేషన్లో సినిమాను తీయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్, మీనాక్షి చౌదరి లను హీరోయిన్లుగా ఎంపిక చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: