హీరోల పుట్టిన రోజులు వ‌స్తే అభిమానులు భారీ క‌టౌట్లు క‌ట్ట‌డం, హంగామా చేయ‌డ‌మే కాకుండా కొన్నిసార్లు గొప్ప పనులు కూడా చేస్తుంటారు. అలా మంచి ప‌నులు చేసి ప‌ది మందికి ఉప‌యోగ‌ప‌డతారు. అయితే హీరోల పుట్టిన‌రోజుల‌కు నిర్వ‌హించే సేవా కార్య‌క్ర‌మాల్లో ముఖ్యంగా అన్న‌ధానం, ర‌క్త‌ధానం ఉంటాయి. మ‌రికొంద‌రు పేద‌ల‌కు స‌రుకులు పంచ‌డం, అనాథాశ్ర‌మాల్లో త‌మ హీరో పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను సెల‌బ్రేట్ చేయ‌డం లాంటివి చేస్తుంటారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆ హీరో పుట్టిన‌రోజుకు వినూత్నంగా వేడుక‌ల‌ను ప్లాన్ చేశారు. తిరుప‌తి ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో హెల్మెట్ల పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌డుతున్నారు. 

మే 20న తిరుప‌తిలోని టౌన్ క్ల‌బ్ లో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. ఎన్టీఆర్ ను ఆద‌ర్శంగా తీసుకుని రోడ్ సేఫ్టీ కార్యక్ర‌మం చేప‌డుతున్నామ‌ని చెప్పారు. ఫ్యాన్స్ క్ల‌బ్ ప్రెసిడెంట్ కిరీటి రెడ్డి, సెక్ర‌ట‌రీ ప్ర‌కాష్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఎన్టీఆర్ తండ్రి, సోద‌రుడు రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆనాటి నుండి ఎన్టీఆర్ ఎక్కువ‌గా త‌న స్పీచ్ ల‌లో రోడ్డు ప్ర‌మాదాల గురించి మాట్లాడుతుంటారు. రోడ్డు సేఫ్టీ గురించి అవేర్ నెస్ కల్పిస్తూ ఉంటారు.

ఈ నేప‌థ్యంలోనే ఎన్టీఆర్ అభిమానులు కూడా హెల్మెట్స్ పంపినీ కార్య‌క్ర‌మం చేప‌డుతూ ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో హెల్మెట్స్ పంపినీ చేయ‌డం ద్వారా కొంద‌రికి అయినా సాయం చేసిన‌ట్టు ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ లాస్ట్ సినిమా దేవ‌ర కాగా ఈ సినిమా ఆశించిన‌మేర విజ‌యం సాధించ‌లేదు. ఇక ఎన్టీఆర్ త‌దుప‌రి సినిమా బాలీవుడ్ లో చేస్తున్నారు. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల కాబోతుంది. వార్ సిరీస్ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో వార్ 3 పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజ‌యం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: