పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా బిజీగా ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ రాబోయే నాలుగేళ్ల పాటు రాజకీయాల వైపు బిజీగా  ఉండబోతున్నట్టుగానే కనిపిస్తోంది.. కానీ గత కొన్నేళ్ల క్రితం సినిమా షూటింగ్ లు మొదలుపెట్టి ఇప్పటికి పూర్తి కాకుండా నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత సమయాన్ని కేటాయించడం జరిగింది. అలా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేయగా జూన్ 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.


ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్న పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సినిమా కావడం చేత బాగానే ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్, టీజర్ తో పాటుగా రెండు సాంగులను కూడా విడుదల చేశారు.అయితే ఇప్పుడు తాజాగా మూడవ సాంగ్ పవర్ ఫుల్ సాంగ్ విడుదల చేసినట్లు చిత్ర బృందం తెలియజేసింది.


ఆ సాంగ్ అసుర హాసనం ఈ పాటని ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా కాలభైరవ వాయిస్ అందించినట్లుగా తెలుస్తోంది. ఈ సాంగ్లో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని చూపించినట్లు కనిపిస్తోంది. అలాగే తన రాజ్యంలో ప్రజలను కూడా కొంతమంది హింసిస్తూ ఉన్నట్లు చూపించారు. పవన్ కళ్యాణ్ స్టిల్స్ తో పాటు పాట కూడా బాగానే ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఆ దుర్మార్గుల నుంచి తమ ప్రజలను ఎలా కాపాడుకున్నారో ఈ పాటలు చాలా క్లియర్ కట్టుగా చూపించారు.అలాగే ఇందులో కొన్ని సన్నివేశాలు కూడా చూపించడం జరిగింది అభిమానులకు ఈ సాంగ్ మాత్రం తెగ ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.


మొదట ఈ చిత్రానికి డైరెక్టర్ క్రిష్ దర్శకత్వ వహించగా కొన్ని కారణాల చేత డైరెక్టర్ తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. నిర్మాతగా ఏం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: