- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు .. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఖలేజా. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ మూవీగా నిలిచింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాకు టీవీలో వచ్చిన రెస్పాన్స్ ఎలాంటిదో అందరికీ తెలిసింది. బుల్లితెరపై ఎక్కువసార్లు మంచి టిఆర్పి రేటింగ్ తెచ్చుకున్న సినిమాగా ఖలేజా రికార్డుల్లోకి ఎక్కింది. తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. ఖ‌లేజా ను ఇప్ప‌టికే ఎన్నో సార్లు బుల్లి తెర మీద చూసేసినా కూడా ఇప్పుడు రీ రిలీజ్ కోసం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.


ఈ సినిమాని థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు చూపిస్తున్న ఆసక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఖలేజా రీ రిలీజ్ సందర్భంగా బుక్ మై షో లో గంటకు ఏకంగా 14 వేలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయి అంటే ఈ సినిమాపై ఎలాంటి బజ్‌ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. మహేష్ బాబు - అనుష్క జంటగా సింగనమల రమేష్ బాబు - శ్రీ కళ్యాణ్ తర్కెక్కించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. మహేష్ బాబు కెరీర్ లో ప్లాప్ అయినా కూడా ఆ తర్వాత కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న‌ సినిమాగా ఖలేజా రికార్డుల్లోకి ఎక్కింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: