- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తాజాగా టాలీవుడ్‌ థియేటర్ల బంద్ విషయం పెద్ద రచ్చగా మారింది. చివరికి ఇదే విష‌యంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం లేఖ‌ రాయడంతో పాటు టాలీవుడ్ ప్రముఖులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ , ఎగ్జిబిటర్ అయిన నట్టి కుమార్ టాలీవుడ్ లో సీనియర్ నిర్మాతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను వైసీపీకి చెందిన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి - దగ్గుబాటి సురేష్ బాబు - అల్లు అరవింద్ కలిసి టార్గెట్ చేశారంటూ నటి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాగైనా పవన్ కళ్యాణ్ సినిమాలను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లేని పక్షంలో ఇప్పటికిప్పుడు థియేటర్లను బందు చేయాల్సిన అవసరం ఏముందని ?  ప్ర‌శ్నించారు.


గతంలో పవన్ కళ్యాణ్ నటించిన వ‌కీల్ సాబ్ - భీమ్లా నాయక్ - బ్రో సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా వైసిపి ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిందని .. ప్రతిసారి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడే కావాలని ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని నటి కుమార్ ఆరోపించారు. ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డితో పాటు సురేష్ బాబు, అల్లు అర‌వింద్ ముగ్గురు క‌లిసి ఈస్ట్ గోదావ‌రి నుంచే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాను అడ్డుకునే కుట్ర‌కు తెర‌లేపార‌ని న‌ట్టి కుమార్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక అల్లు అర‌వింద్ మెగా ఫ్యామిలీలోనే ఉన్నా కూడా తెర‌వెనక ప‌వ‌న్ విష‌యంలో చేయాల్సింది అంతా చేస్తూనే ఉంటార‌ని కూడా న‌ట్టి ఆరోపించారు. ఈ విష‌యం నాకు మాత్ర‌మే కాదు .. ఇండ‌స్ట్రీలో ఉన్న వారికి .. అటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కూడా తెలుసు అని న‌ట్టి అన్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: