
ప్రస్తుతం ఆరాధ్య చదువుతున్న తరచూ తన తల్లితో కలిసి వికేషన్స్ కు వెళుతూ అప్పుడప్పుడు ఎయిర్ పోర్ట్ లో కాని బయటకాని కనిపిస్తూ ఉంటుంది. ఇటీవలే ఒక ఫంక్షన్ కి హాజరైన ఐశ్వర్య, ఆరాధ్యకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. ఈ వీడియో పైన చాలామంది దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆరాధ్యకు ఐశ్వర్యరాయ్ సర్జరీ చేయించిందనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆరాధ్య అందంగా కనిపించడానికి సర్జరీలే కారణం అన్నట్లుగా ఒక రూమర్ అయితే ఇప్పుడు బాలీవుడ్లో వైరల్ గా మారుతున్నది.
అందుకు సంబంధించి ఐశ్వర్యరాయ్, ఆరాధ్య పాత వీడియోలను కొన్ని ఫోటోలను సైతం చూపించి మరి ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం పైన ఐశ్వర్యరాయ్ ని కూడా సర్జరీ చేయించడం అవసరమా ఆరాధ్య చిన్న పిల్ల కదా వదిలేయాల్సింది అంటూ చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆరాధ్య వయసు 13 సంవత్సరాలు.. మరి కొంతమంది మాత్రం ఐష్ కూతురు కాబట్టి అందంగానే కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆరాధ్యను హీరోయిన్గా కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఆరాధ్య సర్జరీ చేయించుకుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది.