
టాలీవుడ్ లో పైకి అందరు హీరోలు కలిసి ఉన్నట్టు నటిస్తారే గాని .. లోపల మాత్రం ఎవరి స్వార్థం వారిది. ఒక హీరో సినిమా ప్లాప్ అయితే కొందరు హీరోలు పార్టీలు సెలబ్రేట్ చేసుకుంటారన్న టాక్ కూడా ఉంది. స్టేజ్ మీద మాత్రం మేం అంతా ఒక్కటే అందరు హీరోల సినిమా లు సూపర్ హిట్లు అవ్వాలని కోరుకుంటున్నాం అని బడాయి కబుర్లు చెపుతుంటారు. అయితే మెగా హీరో సాయి దుర్గ్ తేజ్ ఇందుకు భిన్నం. మెగా కాంపౌండ్ హీరో అయిన ప్రతి ఒక్క హీరోతనూ సన్నిహితంగా .. స్నేహంగా ఉంటాడు. ప్రతి హీరో సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా బాగా ఆడాలని సోషల్ మీడియాలో తన విషెస్ చెపుతుంటాడు. నందమూరి హీరోల సినిమాలు రిలీజ్ అయినా కూడా అలాగే విష్ చేస్తాడు.. బాలయ్య .. ఎన్టీఆర్ అన్న తేడా లేకుండా. పెద్దా .. చిన్నా అన్న బేధం లేకుండా అందరి తోనూ కలిసి పోతాడు.
కొన్నాళ్ళ క్రితం యాక్సిడెంట్ కి గురైనప్పుడు ప్రతి మెగా అభిమాని మాత్రమే కాదు.. ఇతర హీరోల అభిమానుల తో పాటు రాజకీయ నాయకులు అందరూ కూడా బాధపడ్డారు. సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఆయన కోలుకున్నాక కూడా మాట తీరులో ఏదో తేడా కనిపించేది. మామూలు మనిషిగా మారలేడా అనే అనుమానం కలిగేది.
కానీ నిన్న భైరవం హీరోలు నారా రోహిత్,మంచు మనోజ్,బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లతో కలిసి చిట్ ఛాట్ లాంటి కార్యక్రమం తాలూకు వీడియోలో తేజ్ ని చూసి చాలా సంతోషం వేసింది. పూర్తిగా కోలుకున్నాడని అందరికి అనిపించింది. వీడియో ఆసాంతం హుషారుగా నవ్వుతూ,ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ,ఎక్కడా డ్రామా లేకుండా , వాళ్ళు నలుగురు కలిస్తే ఎలా సరదాగా మాట్లాడుకుంటారో అలాగే ఉంది ఆ వీడియో.
భైరవం డైరెక్టర్ విజయ్ కనకమేడల గతంలో పెట్టిన పోస్ట్ నేపథ్యంలో చిన్న డిస్ట్రబెన్స్ నడుస్తున్న సమయంలో ఇది ఒక నష్ట నివారణ చర్య అనుకోవాలి. ఇక సాయి తేజ్ రావడం.. వీరంతా కలిసి చిట్ చాట్ చేయడం ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఈ వీడియో చూసిన వారు సాయి తేజ్ పాజిటివ్ నెస్ గురించి ఎంతో ప్రశంసిస్తున్నారు. ఇలాంటి మంచి మనస్సు ఉన్న హీరోయే టాలీవుడ్ కు కావాలని కోరుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు