ది రాజా సాబ్, హరిహర వీరమల్లు సినిమాలతో టాప్ రేంజ్ హీరోయిన్లకు సరిసమాన స్థాయిలో ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతోంది నిధి అగర్వాల్.. ఈ హీరోయిన్ సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ మజ్ను వంటి సినిమాలు చేసినప్పటికీ ఇందులో ఇస్మార్ట్ శంకర్ మూవీ తప్ప మిగిలిన సినిమాలన్ని అట్టర్ ప్లాఫే. అలా కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా రాణిస్తూ హీరోయిన్ గా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది నిధి అగర్వాల్. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజులుగా ఓ హీరోని ప్రేమిస్తుందని, ఆ హీరో తో పెళ్లికి రెడీ అయిందనే వార్తలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆ హీరోతో పెళ్లి గురించి స్పందించింది. 

నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటినుండి ఇప్పటివరకు నా మీద ఎన్నో ప్రేమ, పెళ్లి వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే నేను మాత్రమే కాదు నాలాగే చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చినప్పటినుండి ఇలాంటి పుకార్లే వారిపై వినిపిస్తూ ఉంటాయి. నాపై ఎన్నో పెళ్లి వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇందులో అస్సలు నిజం లేదు. కానీ జనాలు మాత్రం పుకార్ల మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి వాటినే ఎక్కువగా నమ్ముతారు. వాటినే ఎక్కువగా వైరల్ చేస్తూ ఉంటారు.నా గురించి ప్రతిరోజు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. కానీ నేను దాన్ని ఎక్కువగా పట్టించుకోను. ముఖ్యంగా పెళ్లి గురించి అంటూ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.

 అయితే నిధి అగర్వాల్ తమిళ నటుడు శింబుని పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం ఈ మధ్యకాలంలో జోరుగా జరుగుతుంది. ముఖ్యంగా శింబు తండ్రి ఓ ఇంటర్వ్యూలో నా కొడుకు పెళ్లి త్వరలోనే జరగబోతుంది అని చెప్పడంతో చాలామంది నిధి అగర్వాల్ తో శింబు పెళ్లి పీటలెక్కబోతున్నారు అని మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా విడుదలయ్యాక శింబు నిధి అగర్వాల్  ల పెళ్లి జరగబోతుంది అనే రూమర్ కోలీవుడ్ లో ఎక్కువగా వినిపించడంతో దీనిపై తాజాగా పేరు చెప్పకుండా పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఇక నిధి అగర్వాల్ శింబు కలిసి ఈశ్వరన్ మూవీ లో నటించారు.ఈ సినిమా విడుదలైనప్పటి నుండి వీరి మధ్య ఈ రూమర్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: