ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ చిత్రాలకు మంచి సీక్వెల్స్ తో ప్లాన్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైరెక్టర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలా ఎక్కువగా ఫ్రాంచైజీ  సినిమాల ట్రెండ్ కొనసాగుతూ ఉంది. తాజాగా ఇప్పుడు ఒక మలయాళ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్  ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ సీక్వెల్ చేయాలని చిత్ర బృందం కూడా పక్కా ప్లాన్ తోనే ముందుకు వెళ్తోంది. ఆ సినిమానే మార్కో. హీరోగా ఉన్ని ముకుందన్ ఇందులో నటించగా కీలకమైన పాత్రలలో అభిమన్యు ఎస్ తిలకన్, ముక్తి తారేజా, సిద్ధిక్ జగదీష్ తదితరులు నటించారు.


డైరెక్టర్ హనీఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మలయాళ  ఇండస్ట్రీలోనే కాకుండా విడుదలైన చాలా భాషలలో కూడా మంచి స్పందన లభించింది. A రేటెడ్ సినిమాగా వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇంతటి సంచలన సృష్టించిన మార్కో సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ తెలియజేశారు. అప్పటి నుంచి దీంతో ఉన్ని ముకుందన్ అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.


తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక అభిమాని పెట్టిన కామెంట్స్ కి ఉన్ని ముకుందన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో మార్కో సీక్వెల్ కి పుల్ స్టాప్ పడినట్లుగా కనిపిస్తోంది. మార్కో 2 ఎప్పుడంటు అభిమాని ఉన్ని ముక్కుందని ప్రశ్నించగా.. సీక్వెల్ ఆలోచనలను విరమించుకున్నట్లుగా తెలియజేశారు ఉన్ని ముకుంద. కొన్ని కారణాల చేత ఆ సినిమా సీక్వెల్ చేయలేమని వెల్లడించారు. మార్కో సినిమాకి మించి మరో సినిమాని తీసుకువచ్చేందుకే ప్రయత్నాలు చేస్తున్నామన్నట్లుగా తెలియజేశారు. కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి వచ్చిన నెగెటివిటీ వల్ల ఈ సినిమా సీక్వెల్ ను తీయలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో చాలా హింసాత్మకమైన సన్నివేశాలు ఉండడం వల్లే ఆగిపోయినట్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: