అక్కినేని అఖిల్ ఇటీవల ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. ప్రేయసి జైనాబ్ రావ్జీని అఖిల్ వివాహం చేసుకున్నాడు. నాగార్జున నివాసంలోనే వీరి వెడ్డింగ్ అత్యంత వైభవంగా జరిగింది. ఆ సంగతి పక్కన పెడితే.. అఖిల్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి దాదాపు మూడేళ్లు అవుతోంది. చివరిగా `ఏజెంట్` మూవీతో అఖిల్ ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మినహా అఖిల్ హీరోగా చేసిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. దీంతో ఆయన కెరీర్ డేంజర్‌ జోన్లో పడినట్లు అయ్యింది.


ప్రస్తుతం అఖిల్ `లెనిన్` అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే కసితో ఉన్న అఖిల్ విభిన్నమైన కథను ఎంచుకున్నాడు. మురళీ కిశోర్‌ అబ్బూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా అలరించబోతోంది. కొద్దిరోజుల క్రితం విడుద‌లైన లెనిన్ టీజర్ కు సినీప్రియుల‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.


అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది. లెనిన్ లో నాగార్జున కూడా న‌టిస్తున్నార‌ట‌. కథలో భాగంగా ఈ చిత్రంలో అఖిల్ కు తండ్రి పాత్ర ఉంటుందట. ఆ పాత్రను నాగార్జున చేయబోతున్నారట. అఖిల్ కి ఎలాగైనా ఒక బిగ్ హిట్ ఇవ్వాలనే ఆలోచనతో ఇప్ప‌టికే లెనిన్ నిర్మాణంలో భాగ‌మైన నాగార్జున‌.. ఇప్పుడు సినిమాలో ఓ పాత్ర‌ను పోషించేందుకు సైతం రెడీ అయ్యార‌ట. త‌ద్వారా మూవీపై మ‌రింత హైప్ పెరుగుతుంద‌నే ఉద్ధేశ‌యంతో నాగ్ ఆ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. రియల్ లైఫ్ లో తండ్రీకొడుకులైన నాగార్జున-అఖిల్‌.. రీల్ లైఫ్‌లోనూ ఆ పాత్రలు పోషించుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే అక్కినేని ఫ్యాన్స్ పండ‌గ చేసుకోవ‌డం ఖాయం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: