టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ , తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ మూవీ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వెంకీ , త్రివిక్రమ్ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి ప్రారంభం కాబోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతి వస్తున్నాం సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇక వెంకటేష్ నటించిన చాలా సినిమాలు సంక్రాంతికి విడుదల అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన సినిమాలను సంక్రాంతి పండక్కు విడుదల చేయడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. దానితో ఆగస్టు నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయితే , జెట్ స్పీడ్ లో ఈ మూవీ ని పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉండే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే వచ్చే సంవత్సరం సంక్రాంతికి రావడానికి చాలా మంది హీరోలు రెడీ అయ్యారు.

చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాతో పాటు రవితేజ , కిషోర్ తిరుమల కాంబోలో రూపొందుతున్న సినిమా మరియు నవీన్ పోలిశెట్టి , మీనాక్షి చౌదరి జంటగా రూపొందుతున్న అనగనగా ఒక రాజు సినిమాలు వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. వాటితో వెంకీ , త్రివిక్రమ్ సినిమా కూడా వచ్చినట్లయితే వచ్చే సంవత్సరం సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటీ ఉండడం ఖాయం అని చాలా మంది జనాలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: