సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిన తర్వాత కమర్షియల్ సినిమాలలో నటించడం కంటే కూడా తమ పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పటికే మన తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిన ఎంతో మంది ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి ప్రేక్షకులను అద్భుతమైన స్థాయిలో ఆకట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఇకపోతే ఇదే రూట్ లోకి రష్మిక మందన కూడా వెళుతున్నట్లు కనిపిస్తోంది.

అసలు విషయంలోకి వెళితే ఛలో మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఈమె ఈ మధ్య కాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడానికి అత్యధిక ఆసక్తిని చూపిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈమె రాహుల్ రవీంద్రనాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈమె మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా అందుకు సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. రష్మిక , రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతుంది. 

ఆ సినిమాకు మైసా అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఆ టైటిల్ మరియు ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్లో రష్మిక ఓ కత్తిని పట్టుకొని ఉంది. ఆ కత్తికి , ఆమె ముఖంపై రక్తం ఉంది. ఆ రక్తం ఉన్న ముఖంతో ఆమె గంభీరంగా చూస్తుంది. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ పోస్టర్ తో రష్మిక ఈ సినిమాలో కాస్త మాస్ పాత్రలో కనిపించబోతున్నట్లు అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm