
పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రం టైటిల్ తో వస్తున్న నితిన్ తమ్ముడు సినిమా 75 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు.. సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఒక మారుమూల గ్రామీణ ప్రాంత అంబరగొడుగు అనే ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉన్నది. నితిన్ ఈ చిత్రంలో విల్లు విద్య క్రీడాకారుడుగా ఉండబోతున్నారు. నితిన్ అక్కగా హీరోయిన్ లయ నటించింది. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ తో పాటుగా చిన్న పాప కోసం చేసే సెంటిమెంటుతో ఈ సినిమా స్టోరీ సాగుతుందట.
అంబర గొడుగు ప్రాంతంలో చిక్కుకున్న సోదరి ,ఆమె కూతురుని ఎలా హీరో రక్షిస్తారు అన్నది సినిమా కథ. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్స్ కంటెంట్ సినిమాకి బజ్ క్రియేట్ చేశాయి. తమ్ముడు సినిమా కథ మొత్తం కూడా 80% అటవీ ప్రాంతంలోనే తెరకెక్కించారట. ఇందులో 5 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని ఇవి హైలెట్ గా ఉంటాయని తెలుపుతున్నారు.. ఈ సినిమాకి విజువల్ సౌండ్ ఎఫెక్ట్ వంటివి ప్లస్ పాయింట్ గా ఉన్నాయని. మ్యూజిక్ అందించిన అజనీష్ లోకనాథ్ ప్లస్ గా ఉంటుందని తెలిపారు. నితిన్ యాక్టింగ్ తో పాటు హీరోయిన్స్ నటన, అడవిలో జరిగే సన్నివేశాలు ఈ సినిమాకి హైలెట్ గా ఉంటాయి. లయని గతంలో ఎన్నడూ చూడని పాత్రలో చూడబోతున్నారని ఆమె రీఎంట్రికి టర్నింగ్ పాయింట్ అవుతుందట.
అయితే సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాని చూసి కొన్ని సీన్స్ కట్ చేస్తే U/A సర్టిఫికెట్ ఇస్తామని లేకపోతే ఏ సర్టిఫికెట్ ఇస్తామని సూచించారట. కానీ నిర్మాత డైరెక్టర్ నిరాకరించడంతోA సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. సినిమా రన్ టైం 2.25 గంటలు అయితే 1:45 నేను చాలా రన్ టైం కి ఫిక్స్ చేసినట్లు తెలిపారు. పూర్తి రివ్యూ తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే.