సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలో చాలా చాలా బాగుంటాయి.  కానీ అలాంటి కాంబోలు  సామాన్యంగా కుదరవు.  ఒకవేళ కుదరాయి అంటే మాత్రం రచ్చ రంబోలాని.  ఫ్యాన్స్ కి 100 బిర్యానీ ప్యాకెట్లు తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది . ప్రెసెంట్ అలాంటి ఒక క్రేజీ ఫీలింగ్ ఎంజాయ్ చేస్తున్నారు బాలకృష్ణ . అదే విధంగా హీరో విశ్వక్ సేన్  ఫ్యాన్స్.  దానికి కారణం బాలకృష్ణ - విశ్వక్సేన్ ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నాడు అన్న వార్త బయటకు రావడమే . తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన "ఈ నగరానికి ఏమైంది" మూవీ 2018 లో రిలీజ్ అయింది. విశ్వక్ సేన్ అంటే ఇది అని ఈ సినిమా ప్రూవ్ చేసింది.


బిగ్గెస్ట్ హిట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచింది . ఈ మూవీకి సీక్వెల్ త్వరలోనే రాబోతున్నట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది . దీంతో విశ్వక్ సేన్  ఖాతాలో మరో హిట్ కన్ఫర్మ్ అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.  అయితే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కూడా ఒక కీలకపాత్రలోనటించబోతున్నాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ ఉందట.  అది సినిమాకి హైలెట్ గా మారబోతుందట.  దానికోసం బాలయ్యను అప్రోచ్ అవ్వగా చిత్ర బృందం ఆయన ఓకే చేశారట .



విశ్వక్సేన్ - బాలయ్యకు ఎంత వీర అభిమాని అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎన్నో ఇంటర్వ్యూలలో ఎన్నో సందర్భాలలో ఆ విషయాన్ని బయట పెట్టాడు. విశ్వక్సేన్ తో కలిసి కొన్ని నిమిషాల పాటు బాలయ్య కనిపించబోతున్నాడట . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . ఫిలిం సర్కిల్స్ లో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . నందమూరి అభిమానులు - విశ్వక్ సేన్ ఫ్యాన్స్  ఓ రేంజ్ లో ఈ కాంబో కోసం వెయిట్ చేస్తున్నారు . ఆ కాంబో సెట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు . ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది . సురేష్ ప్రొడక్షన్స్ ఒరిజినల్స్ బ్యానర్లపై సురేష్ బాబు ..సృజన్ ఎరబోలు ..సందీప్ నాగిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: