ఇండస్ట్రీలో సిమ్రాన్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఎలాంటి పరువు ప్రతిష్ట ఉన్నాయి అనేది కూడా అందరికి తెలిసిందే.  సిమ్రాన్ అంటే చాలామందికి ఏదో తెలియని క్రేజీ ఫీలింగ్.  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది . మరీ ముఖ్యంగా "సితయ్య" లాంటి సినిమాలో  నటిస్తుంది అని జనాలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు.  స్టార్ హీరో హరికృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకొని వావ్ అనిపించింది . అంతేకాదు ఆయనతో డాన్స్ చేసి మరి అభిమానులను ఇంప్రెస్ చేసింది.


కాగా సిమ్రాన్ లో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఆమె ట్రెడిషనల్ రోల్స్ కి మాస్ రోల్స్ కి ఎలాంటి రోల్స్ కి అయినా సరే అచ్చు గుద్దిన్నట్లు ఇమిడిపోతుంది . ఆ క్యారెక్టర్ ఆమె కోసమే రాసారా..? అన్నట్లు సెట్ అవుతుంది . అలా ప్రతి హీరోయిన్ కి సెట్ అవ్వడం చాలా చాలా రేర్ . అలాంటి ఒక ఘనత అందుకుంటుంది ఇప్పుడు హీరోయిన్ నయనతార . సౌత్ ఇండియాలోనే క్రేజియస్ట్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న నయనతార కూడా తన నటనను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ సినిమాల కోసం రిస్కులు చేయిస్తూ ఉంటుంది .



ఒక సినిమాలో  సెంటిమెంట్ మరొక సినిమాలో నెగిటివ్ షేడ్స్ మరొక సినిమాలో అమ్మవారిగా మరొక సినిమాలో నాటి గర్ల్ గా ఇలా రకరకాలుగా తన పెర్ఫార్మన్స్ చూపిస్తూ ఉంటుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హీరోయిన్ సిమ్రాన్ ప్లేస్ ని ఎప్పుడు ఏ హీరోయిన్ రీప్లేస్ చేస్తుంది అంటే మాత్రం కచ్చితంగా నాయనతారనే అంటున్నారు జనాలు . అదేవిధంగా ట్రెండ్ చేస్తున్నారు . సిమ్రాన్ పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతుంది. కాగా హీరోయిన్ నయనతార మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా చేస్తుంది . అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో చాలా నాటీ పాత్రలో కనిపించబోతుందట నయనతార..!!

మరింత సమాచారం తెలుసుకోండి: