మహిళలను లైంగికంగా వేధించినట్లయితే కఠిన శిక్షలు అమలు అవుతున్న రోజులవి. అయినా కూడా ఆ శిక్షాలను కొంత మంది బేఖాతరు చేస్తూ మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఓ పూజారి తనను లైంగికంగా వేధించాడు అని మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషల్లిని కనారన్ ఆరోపించింది. పోయిన శనివారం కౌలాలంపూర్ లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి కొద్ది దూరంలో ఉన్న సెపాంగ్‌లోని మరియమ్మన్ ఆలయంలో ఈ ఘటన జరిగినట్లుగా ఈమె సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ద్వారా తెలిపింది.

తాజాగా లిషల్లిని కనారన్ కూడా ఈ విషయం గురించి సోషల్ వేదికగా షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే ఈ విషయం ప్రస్తుతం చాలా వైరల్ గా మారింది. భారత దేశానికి చెందిన పౌరుడు అయినటువంటి ఒక పూజారి ఈ ఘటనకు ఓడిగట్టినట్లు ఆమె చెప్పుకొచ్చింది.  భారతదేశానికి చెందిన పూజారి పవిత్ర జలం భారతదేశం నుంచి వచ్చిందని చెబుతూ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని లిషల్లిని కనారన్ తాజాగా  ఆరోపించింది. ఈ మేరకు లిషల్లిని కనారన్ తన ఇన్‌ స్టా గ్రామ్ అకౌంట్ లో కూడా తనకి తాజాగా ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఇకపోతే ఆమె కథనం ప్రకారం ఏం జరిగింది అనేది తెలుసుకుందాం ... జూన్ 21 వ తేదీన నేను ఒంటరిగా గుడికి వెళ్లాను. నేను గుడికి వెళ్ళిన సమయంలో  ఆస్థాన పూజారి లేడు. ఇక ఆ స్థానంలో ఆ సమయంలో ఓ పూజారి తాత్కాలికంగా విధులను నిర్వర్తిస్తున్నాడు. ఆ సమయంలో విధుల్లో ఉన్న పూజారి నా వ‌ద్ద‌కు వ‌చ్చి కాసేపు ఆగమని చెప్పి ప్రార్థ‌న‌లు ముగిసిన త‌ర్వాత కలుస్తాను అని అన్నాడు. ఇక ఆ తర్వాత సుమారు గంట సమయం తర్వాత ఆ పూజారి వ‌చ్చి నన్ను తన ప్రైవేటు ఆఫీసుకు తీసుకెళ్లాడు.

ఇక ఆ ప్రైవేట్ ఆఫీసులో  నన్ను ఆశీర్వదిస్తున్నట్లు చెప్పి ఓ ద్రవాన్ని నాపై చల్లాడు. ఆ ద్రవాన్ని నాపై చల్లిన అనంతరం ఆ పూజారి నా ఒంటిపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ టైమ్ లో నా బ్రెయిన్ కూడా ప‌నిచేయ‌లేదు. అలాగే నోటి నుంచి మాట‌లు కూడా రాలేదు. ఆ సమయంలో నేను పూర్తిగా నిశ్చేష్టురాలైపోయాను అని లిషల్లిని కనారన్ చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఈమె గుడిలో పూజారి వేధించిన విషయాన్ని అసలు తట్టుకోలేకపోతున్నాను అని , అందుకే ఈ విషయాన్ని బహిరంగంగా తెలియజేస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Lk