
స్టోరీ విషయానికి వస్తే..
రామ్ (సుహాస్) తన మామయ్య (ఆలీ) తో కలిసి పెరుగుతూ ఉంటాడు.పై చదువుల కోసం ఫారెన్ కి వెళ్లాలని సినిమాలకి దూరంగా ఉంటాడు.. ఫ్రెండ్స్ సినిమాకు వెళ్ళినా సరే థియేటర్ బయట ఉండి మరి సినిమా కథ విని అది ఆడుతుందా లేదా? అని చెప్పగలిగే టాలెంట్ ఉంటుంది రామ్ కు. అయితే ఒక రోజు తన అమ్మ (అనిత) జయంతి సందర్భంగా వరంగల్ కి వెళ్ళగా రోడ్డుపైన నడుచుకుంటూ వస్తున్న సత్యభామ (మాళవిక మనోజ్) తాగి కారు నడపడంతో యాక్సిడెంట్ కి గురవుతుంది.దీంతో ఆమెను సేఫ్ గా వాళ్ళ ఇంటిలో దిగబెడతాడు రామ్. ఆ తర్వాత సత్యభామ, రామ్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా రామ్ వెంటపడి చివరికి ప్రేమలో పడేస్తుంది. అయితే ఒక రోజు అనుకోకుండా కథ చెబుతానని స్మశానానికి తీసుకువెళ్లి అక్కడ స్టోరీ చెప్పి మరి భయపెడుతుంది. ఇలాంటి సమయంలోనే సత్యభామ తండ్రి (పృధ్విరాజ్) ఆమెకు సంబంధాలు చూస్తూ ఉన్న ఆమె రామ్ విషయాన్నీ చెప్పకుండా దాచిపెడుతుంది. సత్యభామ బర్త్ డే సందర్భంగా షాపింగ్ కి తీసుకు వెళ్తున్న సమయంలో రామ్ కు జరిగే యాక్సిడెంట్ ని తప్పించే ప్రయత్నంలో తన యాక్సిడెంట్ కి గురవుతుంది. తన తల్లి ప్రేమను సత్యభామలో చూసుకున్న రామ్.. సత్యభామను వివాహం చేసుకోవాలని చూసిన నిమిషంలో సత్యభామ, రామ్ దగ్గర నుంచి మూడేళ్ల పాటు దూరంగా ఉండాలని ప్రామిస్ తీసుకుంటుంది. నువ్వు ఒక గొప్ప డైరెక్టర్ కావాలని ప్రామిస్ తీసుకుంటుంది. రామ్ కు సత్యభామ అలాంటి ప్రామిస్ ఎందుకు వేయించుకుంది?. సినిమాలంటే ఇష్టం లేని రామ్ చేశారా?. రోడ్డుపైన చూసిన వ్యక్తి ఎవరు ? రామ్ తల్లికి.. సత్యభామ కు మధ్య బంధం ఏంటి? అన్నదే కథ.
ఓ భామా అయ్యో రామ చిత్రం మదర్ సెంటిమెంట్ ని జోడించి కొంతమేరకు ఎమోషనల్ టచ్ ఇచ్చిన కామెడీతో బాగానే నడిపించారు. సరదాగా ఎమోషనల్ గా సాగిపోయే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. మధ్యలో కథలు చెప్పి విసిగించడం వంటివి రొటీన్ గా అనిపించాయట. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ రొమాన్స్ పర్వాలేదు అనిపించుకున్న ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకి బాగుందట. మధ్యలో కమెడియన్ ఆలీ పాత్ర ఎమోషనల్ గా మారింది..
సినిమా ప్లస్సులు:
సెకండాఫ్ తర్వాత సినిమా కొంత బెటర్ గా అనిపించింది.
సుహాస్ మదర్ ఎపిసోడ్ ఎమోషనల్.
రొటీన్ ముగింపు కాకుండా కాస్త భిన్నంగా ఉన్నది.
ఫ్రెండ్ పెళ్లిలో కామెడీ సన్నివేశాలు.
మైనస్:
ఫస్ట్ ఆఫ్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండు.
సినిమాలో మెయిన్ ఎమోషన్ ఆకట్టుకునేలా లేదని మధ్యలో కట్ కట్ సన్నివేశాలు ఉన్నాయట.
లవ్ స్టోరీ కొత్తగా లేకపోవడం.. మరింత వర్క్ చేసి ఉంటే సెకండ్ హాఫ్ హైలెట్గా నిలిచేది.
నటీనటుల విషయానికి వస్తే..
రామ్ పాత్రలో సుహాస్ అద్భుతంగా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాలలో కూడా అద్భుతంగా నటించారు.
సత్యభామ పాత్రలో మాళవిక మనోజ్ కూడా అద్భుతంగా నటించింది. కొన్ని సన్నివేశాలలో హీరో సుహాసిని డామినేట్ చేసేలా నటించింది
సుహాస్ తల్లిగా అనిత పాత్ర సర్ప్రైజ్ అని చెప్పవచ్చు.
ఇందులో మిగిలిన పాత్రలు ఓకే అనిపించిన.. డైరెక్టర్ హరి శంకర్ గెస్ట్ రోల్ సర్ప్రైజ్ గా అనిపిస్తుంది. అలాగే డైరెక్టర్ మారుతి కూడా కనిపించారు.
మొత్తానికి ఎమోషనల్ , మదర్ సెంటిమెంట్తో ఫ్యామిలీ చూడగలిగే సినిమా..
రేటింగ్ 2.70