
తాజాగా ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంటుండగా, దర్శకుడు గౌతమ్ మీనన్ చేసిన ఒక కామెంట్ అందరిలో ఆసక్తిని రేపుతోంది . ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ మాట్లాడుతూ – "మొదటగా ఈ సినిమా మహేష్ బాబు తో ప్లాన్ చేశాం. అలాగే క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్ పెళ్లి దగ్గరకు వెళ్లే సీన్ కి గెస్ట్ పాత్రలో చిరంజీవిని తీసుకోవాలని అనుకున్నాం. హీరో హెలికాప్టర్ లో వస్తాడు. ఆ సీన్‌లో చిరు మానవతా స్పూర్తి తో వారిని కలిపే ప్రయత్నం చేస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల చిరు ఆ పాత్ర చేయలేదు. సమంత ఫ్యాన్స్ కు అసలైన పండగే!.. ఈ ఇంట్రెస్టింగ్ సమాచారం నెట్టింట వైరల్ కావడంతో, సమంత అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు.
"ఒకవేళ చిరంజీవి ఆ పాత్ర చేసి ఉంటే ... సమంతకి తొలి సినిమా నుంచే మెగాస్టార్‌తో స్క్రీన్‌షేర్ చేసే ఛాన్స్ దక్కేది!" అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే గతంలో ఏమి జరిగిందో అదే నిజం. చిరు ఆ పాత్ర చేయకపోయినా, సమంత ఈ సినిమాతోనే అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం రీరిలీజ్ కానుండటంతో మళ్లీ జెస్సీ మాయలో అభిమానులు మునిగిపోనున్నారు! సినిమా చరిత్రలో ఎన్నో మిస్‌డ్ మిరాకిల్స్ ఉన్నాయ్ ... వాటిలో ఒకటి చిరు – సమంత కలయిక. కానీ అదెప్పుడైనా జరిగితే మాత్రం అదో బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ కావడం ఖాయం!