తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. పూరి జగన్నాథ్ కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా కథ రచయితగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన ఫుల్ స్పీడ్ గా మూవీలను రూపొందించడంలో స్పెషలిస్ట్. ఇక పూరి జగన్నాథ్ ఫుల్ స్పీడ్ లో కథలను కూడా పూర్తి చేస్తాడు అని చాలా మంది చెప్పుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. పూరి జగన్నాథ్ ఒక సినిమా కథను కేవలం లంచ్ టైం లో పూర్తి చేశాడట. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ దగ్గర చాలా కాలం పాటు పని చేసిన కథ రచయిత తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర చాలా కాలం పాటు పని చేశాను. రవితేజ హీరోగా త్రిష హీరోయిన్ గా పూరి జగన్నాథ్ ఒక సినిమా చేయాలి అనుకున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన  కథ మొత్తం పూర్తి అయింది. ఇక అంతా ఓకే అనుకొని మూవీ స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు రవితేజ మరో మూవీ చూసి దాని రీమిక్ లో నటించాలి అనుకున్నారు. దానితో రవితేజ , త్రిష లతో  అనుకున్న సినిమా ఆగిపోయింది. ఈ గ్యాప్ లో ఏదైనా సినిమాను త్వరగా పూర్తి చేద్దాం అని పూరి జగన్నాథ్ గారు అనుకున్నారు. ఇక మేము ఒక రోజు లంచ్ చేస్తూ ఒక పాయింట్ అనుకున్నాం. ఆ పాయింట్ అలా డెవలప్ చేస్తూ చేస్తూ లంచ్ పూర్తి అయ్యే లోపు ఒక కథ పూర్తిగా రెడీ అయింది.

అలా పూర్తి అయిన కథతోనే 143 అనే సినిమాను పూరి జగన్నాథ్ గారు రూపొందించారు. ఆ మూవీ లో పూరి జగన్నాథ్ గారి తమ్ముడు అయినటువంటి సాయి శంకర్ హీరో గా నటించాడు అని తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. సాయి శంకర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 143 అనే సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: