ఎన్టీఆర్ అనగానే అందరికీ బాగా ముందుగా గుర్తు వచ్చేది డైలాగ్ డెలివరీ . ఎన్టీఆర్ చెప్పినంత హుందాగా ఓపెన్ గా క్లియర్ గా ఏ హీరో కూడా డైలాగ్స్ చెప్పలేరు.  ఆశ్చర్యం ఏంటంటే ఎన్టీఆర్ ఒకే ఒక్క షాట్ లో ఎంత పెద్ద డైలాగ్ అయినా ఓకే చేసేస్తాడు . అలాంటి టాలెంట్ ఉన్న హీరో. మరి అలాంటి హీరో క్యారెక్టర్ కి నత్తి జబ్బును అంటగడితే ఇంకేముంది..? మొత్తం కొలాప్స్.  ఇది తెలిసి ఫ్యాన్స్ ఊరుకుంటారా..? చాలా చాలా రచ్చ చేసేస్తారు.  ప్రజెంట్ ఇప్పుడు ఏం చేయాలో తెలియని అయోమయ సిచువేషన్ లో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.


మనకు తెలిసిందే ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా మరికొద్ది రోజుల్లోనే రిలీజ్ కాబోతుంది . వార్ 2 ప్రమోషన్స్ లో కూడా పాల్గొనడానికి రెడీ అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ . కాగా ఆ తర్వాత ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో తెరకెక్కే సినిమా మూడో షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు . అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో ఎన్టీఆర్ ఒక జబ్బు క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట . అది కూడా నత్తి జబ్బు ఉన్నట్లు కనిపించబోతున్నాడట . ఎన్టీఆర్ లాంటి హీరోకి నత్తి జబ్బు పెడితే ఆయన చెప్పే డైలాగ్స్ ఎలా ఉంటాయి అనేది అందరూ ఊహించుకోవచ్చు .



అసలు డైలాగ్స్ లేకుండా ఎన్టీఆర్ ని ఏ సినిమాలో అయినా మనం ఊహించుకోగలమా..? నో మరి ఎందుకు ప్రశాంత్ నీల్ ఇలాంటి రిస్క్ చేస్తున్నాడు..? అనేది అర్థం కావడం లేదు . అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయెల్ షేడ్స్ లో కనిపించబోతున్నారట.  ఆయనకు సంబంధించిన ఒక క్యారెక్టర్ కి మాత్రమే ఇలాంటి జబ్బు ఉంటుందట.  ఇంకొక క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నార్మల్గానే కనిపిస్తారట.  సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు . ప్రశాంత్ నీల్ ఏం చేసినా డిఫరెంట్ గా చేస్తారు అని కొందరు అంటుంటే ప్రశాంత్ నీల్ ఎందుకయ్యా ఈ నిర్ణయం తీసుకున్నావ్..? అని మండి పడిపోతున్నారు . చూడాలి మరి సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో..? ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ సెలెక్ట్ అయ్యింది.  అయితే రెండవ హీరోయిన్గా రష్మిక మందన్నా.. స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వంటి బ్యూటీస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు ప్రశాంత్ నీల్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: