టాలీవుడ్ లో మోస్ట్ అవైడెడ్ చిత్రంగా హరిహర వీరమల్లు సినిమా ఉన్నది. నిన్నటి రోజున ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలయ్యింది. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కావడం చేత అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ సినిమా చూడడానికి థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో మొదటి రోజే భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడతాయనే విధంగా వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్ల చిత్రానికి ప్రీమియర్ షోలు కూడా వేశారు. అయితే ఈ షోలకు సంబంధించి కలెక్షన్స్ విషయంపై నిన్నటి రోజున పలు రకాల రూమర్స్ వినిపించాయి..


నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో భాగంగా ప్రీమియర్ షోకి సంబంధించి  సుమారుగా రూ .30 కోట్ల రూపాయల వరకు కలెక్షన్ వచ్చాయని  చెప్పడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.ఇక తనకు ఈ అంకెలు ముఖ్యం కాదని చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ సినిమాలో ప్రస్తావించినట్లు తెలియజేశారు. సినిమా అనేది ఏదైనా కథను చెప్పడానికి గొప్ప మాధ్యమమని  తెలియజేశారు. ఇక సోషల్ మీడియా సంగతి విషయానికి వస్తే తనకు అది ఉపయోగించడం ఇష్టం ఉండదంటూ తెలియజేశారు పవన్ కళ్యాణ్.


 ఈ విషయం అంత పక్కన పెడితే మొదటిరోజు ఎన్ని కోట్ల రూపాయలు కలెక్షన్ రాబట్టిందనే విషయంపై అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మించిన  సినిమా కావడం గమనార్హం. హరిహర వీరమల్లు 2 సినిమా పైన కూడా ఇంకా ఎలాంటి స్పష్టత కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ అయితే చేయడానికి మక్కువ చూపిస్తున్నప్పటికీ మరి దర్శక నిర్మాతలు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలను పూర్తిచేయాలని అలాగే పొలిటికల్ పరంగా కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించేలా ప్లాన్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: